ETV Bharat / sitara

పునీత్ రాజ్​కుమార్ డ్రీమ్ ప్రాజెక్టు టీజర్ రిలీజ్ - పునీత్ రాజ్​కుమార్ డెత్

Puneeth rajkumar movies: కన్నడ స్టార్ పునీత్​ రాజ్​కుమార్ ఎంతో ఇష్టపడి నటించి, నిర్మించిన సినిమా 'గందద గుడి'. దీని టీజర్​ సోమవారం విడుదలవగా, పలువురు స్టార్స్ దీనిని షేర్ చేస్తున్నారు.

Puneeth Rajkumar
పునీత్ రాజ్​కుమార్
author img

By

Published : Dec 6, 2021, 3:37 PM IST

Gandhada gudi teaser: ఇటీవల గుండెపోటుతో మరణించిన పునీత్ రాజ్​కుమార్ డ్రీమ్​ప్రాజెక్టు 'గందద గుడి' టీజర్​ రిలీజైంది. ఆయన తల్లి పార్వతమ్మ జయంతి సందర్భంగా ఈ టీజర్​ను రిలీజ్​ చేశారు.

కర్ణాటకలోని వైల్డ్​లైఫ్​ ఆధారంగా తీసిని ఈ డాక్యుమెంటరీని పునీత్​ స్వయంగా నిర్మించారు. అలానే దీనిని తెరకెక్కించిన అమోఘ వర్షతో కలిసి ఇందులో నటించారు. వచ్చే ఏడాది, థియేటర్లలో 'గందద గుడి'ని రిలీజ్ చేయనున్నారు.

Puneeth Rajkumar Gandhada Gudi
'గందద గుడి' సినిమాలో పునీత్​ రాజ్​కుమార్

నిమిషం పాటు సాగే ఈ టీజర్​లో కర్ణాటకలోని అడవులు, జలపాతాలు చూపించారు. వీటి వెంట నడుస్తూ కనిపించిన పునీత్-అమోఘ వర్ష.. నీటి లోపల కూడా డైవింగ్ చేస్తూ కనిపించారు.

1973లో కన్నడలో హిట్​గా నిలిచిన 'గందద గుడి' సినిమాలో పునీత్ తండ్రి, కన్నడ కంఠీవ డాక్టర్.రాజ్​కుమార్ హీరోగా నటించారు. ఆ పేరునే ఈ చిత్రానికి పెట్టారు.

కన్నడ ఇండస్ట్రీకి చెందిన కేజీఎఫ్ డైరెక్టర్ ప్రశాంత్ నీల్, నటుడు రక్షిత్ శెట్టి, నిర్మాత కార్తిక్ గౌడ తదితరులు ఈ టీజర్​ను తమ సోషల్ మీడియా ఖాతాల్లో పోస్ట్ చేస్తున్నారు. అప్పు(పునీత్ రాజ్​కుమార్)ను మరోసారి గుర్తు చేసుకుంటున్నారు.

అక్టోబరు 29న అకస్మాత్తుగా గుండెపోటు రావడం వల్ల పునీత్ మరణించారు. మరోవైపు ఆయన మరణాన్ని తట్టుకోలేక పలువురు అభిమానులు కూడా తనువు చాలించారు.

  • " class="align-text-top noRightClick twitterSection" data="">

ఇవీ చదవండి:

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.