ఇటీవల మరణించిన కన్నడ పవర్ స్టార్ పునీత్ రాజ్ కుమార్‌కు (puneeth rajkumar death) 'కర్ణాటక రత్న' పురస్కారాన్ని (karnataka ratna award) ఇవ్వనున్నట్లు ఆ రాష్ట్ర ముఖ్యమంత్రి బసవరాజు బొమ్మై ప్రకటించారు. 'పునీత్ నమన' (పునీత్‌కు వందనం) పేరుతో కర్ణాటక ఫిల్మ్ ఛాంబర్ ఆఫ్ కామర్స్ బెంగళూరులో ఏర్పాటు చేసిన కార్యక్రమంలో ఆయన పాల్గొన్నారు. పునీత్ చిత్రపటానికి పూలమాల వేసి నివాళులర్పించారు. ఈ సందర్భంగా మాట్లాడిన సీఎం.. చాలామందితో సమాలోచనలు చేసిన తరువాత పునీత్‌కు కర్ణాటక అత్యున్నత పురస్కారమైన కర్ణాటక రత్నను ఇవ్వాలని నిర్ణయించినట్లు తెలిపారు.
అప్పుకు కర్ణాటక రత్న అవార్డు ప్రకటించగానే కార్యక్రమానికి వచ్చిన మాజీ సీఎం బీఎస్ యడియూరప్ప, ప్రతిపక్ష సిద్ధ రామయ్యతో పాటు అక్కడున్న వారంతా ఒక్కసారిగా లేచి కరతాళధ్వనులతో తమ సమ్మతిని తెలిపారు. ఇప్పటివరకు ఈ అవార్డును 9 మందికి ప్రకటించగా.. 10వ వ్యక్తిగా పవర్ స్టార్ నిలవనున్నారు.
పద్మశ్రీ అవార్డుకు సిఫార్సు..
పునీత్ రాజ్‌కుమార్ పేరును పద్మశ్రీ అవార్డును సిఫార్సు చేస్తున్నట్లు ముఖ్యమంత్రి బొమ్మై పేర్కొన్నారు. కంఠీరవ స్టూడియోలో దివంగత నటుడు డా.రాజకుమార్ స్మారక చిహ్నం పక్కనే పునీత్ రాజ్‌కుమార్ మెమోరియల్ ఏర్పాటు చేయనున్నట్లు సీఎం తెలిపారు.
పునీత్ రాజ్‌కుమార్.. కన్నడ దిగ్గజ నటుడు రాజ్‌కుమార్ కుమారుడు. ఐదుగురు సంతానంలో ఆయనే చిన్నవాడు. అక్టోబర్ 29న వ్యాయామం చేస్తూ గుండెపోటు రాగా ఆస్పత్రిలో చేరిన పునీత్.. ఆరోజే మరణించారు(puneeth rajkumar news). 6 నెలల వయసులోనే వెండితెర తెరంగ్రేట్రం చేసిన ఆయన.. 2002లో అప్పు సినిమా ద్వారా హీరోగా పరిచమయ్యారు. పలు సూపర్‌హిట్ సినిమాల్లో నటించి కన్నడ పవర్‌స్టార్‌గా గుర్తింపు తెచ్చుకున్నారు. ఎన్నో సేవా కార్యక్రమాలు చేసి గొప్ప దాతృత్వం చాటుకున్నారు.
ఇదీ చూడండి: హీరో కుటుంబంలో విషాదం- యాక్సిడెంట్లో ఒకేసారి ఆరుగురు మృతి