గుండెపోటుతో(puneeth rajkumar heart attack) అకస్మాత్తుగా ఈ లోకాన్ని విడిచి వెళ్లిన కన్నడ పవర్‌స్టార్ పునీత్ రాజ్‌కుమార్(అప్పు, puneeth rajkumar eye transplant).. బెంగళూరు నారాయణ నేత్రాలయకు తన కళ్లను దానం(eye donation) చేసి ఆదర్శంగా నిలిచారు. అప్పు మరణానంతరం ఆ నేత్రాల ద్వారా వైద్యులు ఓ మహిళతో పాటు మరో ముగ్గురికి చూపు వచ్చేలా చేశారు. ఇప్పుడు ఆయన నుంచి స్ఫూర్తి పొందిన అభిమానులు పునీత్ తరహాలోనే తమ కళ్లను దానం చేస్తున్నారు(puneeth rajkumar eyes). వందలమంది ఫ్యాన్స్ తమ నేత్రాలను దానం చేసేందుకు ముందుకు వస్తున్నారని నారాయణ నేత్రాలయ ఆస్పత్రి నిర్వాహకులు తెలిపారు. ఇప్పటికే చాలా మంది రిజిస్ట్రేషన్ చేసుకున్నారని వెల్లడించారు.
పునీత్ సమాధిని సందర్శించిన అనంతరం నేరుగా తమ హాస్పిటల్‌కు అభిమానులు తరలివస్తున్నారని డాక్టర్ బుజంగా శెట్టి తెలిపారు. మొదట కేవలం ముగ్గురు లేదా నలుగురు మాత్రమే తమ కళ్లను దానం చేసేందుకు ముందుకొచ్చారని.. కానీ ఆ తర్వాత సంఖ్య క్రమక్రమంగా 200కుపైగా చేరిందని అన్నారు.
తండ్రి బాటలోనే
తన తండ్రి సీనియర్ నటుడు రాజ్‌కుమార్‌ను ఆదర్శంగా తీసుకున్న పునీత్.. కెరీర్లో ఎన్నో సేవా కార్యక్రమాలు నిర్వహించారు. రాజ్‌కుమార్ మాదిరిగానే పునీత్ కూడా మరణానంతరం తన కళ్లను దానం చేశారు.
అకస్మాతుగా
అక్టోబర్ 29న ఉదయం 11:30 గంటల సమయంలో జిమ్‌లో వ్యాయామం చేస్తున్న సమయంలో పునీత్‌కు అకస్మాతుగా ఛాతీలో నొప్పి వచ్చింది. దీంతో ఆస్ప్రత్రిలో చేర్చారు. కానీ వైద్యులు ఆయన ప్రాణాలు కాపాడలేకపోయారు. ఈ విషయం తెలియగానే అభిమానులు శోకసంద్రంలో మునిగిపోయారు. పలు భాషలకు చెందిన నటీనటులు.. పునీత్ ఇంటికి చేరుకుని వారి కుటుంబసభ్యులను పరామర్శించారు.
ఇదీ చూడండి: