ETV Bharat / sitara

'పునాదిరాళ్లు' దర్శకుడి దీనగాథ - పునాది రాళ్లు దర్శకుడు గుడిపాటి రాజ్​కుమార్ మృతి

మెగాస్టార్ చిరంజీవి లాంటి కథానాయకుడిని ఇండస్ట్రీకి పరిచయం చేసిన దర్శకుడు గుడిపాటి రాజ్​కుమార్. అనారోగ్యం కారణంగా ఈరోజు తుదిశ్వాస విడిచారు. చివరి రోజుల్లో ఎన్నో కష్టాలను అనుభవించిన రాజ్​కుమార్ దీనగాథపై ఓ ప్రత్యేక కథనం.

'పునాదిరాళ్లు' దర్శకుడి దీనగాథ
'పునాదిరాళ్లు' దర్శకుడి దీనగాథ
author img

By

Published : Feb 15, 2020, 8:33 PM IST

Updated : Mar 1, 2020, 11:27 AM IST

'పునాదిరాళ్లు' దర్శకుడి దీనగాథ

అతనొక ఫిజికల్ డైరెక్టర్. కానీ కాలం అతని చేత కలం పట్టి కథ రాయించింది. డైరెక్టర్​ను చేసి నాన్న పొలం అమ్మి సినిమా తీయించింది. ఇండస్ట్రీకి మెగాస్టార్ లాంటి కథానాయకుడ్ని తీసుకొచ్చేలా చేసింది. కట్ చేస్తే తొలి సినిమాకే ఐదు నందులను తీసుకొచ్చిన ఆ దర్శకుడు.. కాలగమనంలో ఓ అద్దె ఇంట్లో మంచాన పడి చివరి రోజులు గడిపాడు. అతడే... మెగాస్టార్ చిరంజీవి జీవితానికి పునాదిరాళ్లెత్తిన గూడపాటి రాజ్ కుమార్. సామాజిక స్పృహ కలిగిన దర్శకుడిగా గుర్తింపు పొందిన రాజ్ కుమార్ ఈరోజు అనారోగ్యం కారణంగా మృతిచెందారు.

మెగాస్టార్ చిరంజీవి అలియాస్ శివశంకర వరప్రసాద్​కు తెలుగు తెరపై నటించే అవకాశం ఇచ్చిన తొలి దర్శకుడు ఈయనే. పేరు గూడపాటి రాజ్ కుమార్. వయస్సు 75 ఏళ్లు. పెత్తందారి వ్యవస్థపై యువతరం ఎలా తిరగబడిందనే ఇతివృత్తంతో 1978లో పునాదిరాళ్లు చిత్రానికి దర్శకత్వం వహించి ఆ సినిమాకు ఉత్తమ చిత్రం, ఉత్తమ దర్శకుడు, ఉత్తమ కథ, ఉత్తమ నటుడు, ఉత్తమ స్క్రీన్ ప్లే విభాగాల్లో ఐదు నంది పురస్కారాలను తీసుకొచ్చారు. ఎంతో మంది విమర్శకుల ప్రశంసలందుకున్నారు. అనేక సామాజిక అంశాలపై ఈ సమాజం మాకొద్దు, తాండవకృష్ణ తారంగం, మన ఊరి గాంధీ, మా సిరిమల్లె చిత్రాలకు తెరకెక్కించారు.

కృష్ణాజిల్లా ఉయ్యూరు రాజ్ కుమార్ స్వస్థలం. తల్లిదండ్రులది వ్యవసాయ కుటుంబం కావడం వల్ల విజయవాడలోనే విద్యాభ్యాసం పూర్తి చేసి హైదరాబాద్​లో ఫిజికల్ డైరెక్టర్​గా ఉద్యోగం సంపాదించారు. తెలుగు పిల్లలను జాతీయ స్థాయిలో మంచి ఆటగాళ్లుగా తీర్చిదిద్దడమే లక్ష్యంగా పనిచేసేవారు. శారీరక ధారుడ్యం, చక్కటి మాటతీరు ఉండటం వల్ల ఫలక్​నుమాలో ఉండే సదరన్ మూవీస్ స్టూడియో అధినేత రాజ్ కుమార్​ సినిమాల్లోకి రమ్మని ఆహ్వానించారు. అదే రాజ్ కుమార్ జీవితాన్ని మలుపుతిప్పింది. అప్పటిదాక పిల్లలు, ఆటలతో సాగిపోయిన జీవితం.. రంగుల ప్రపంచంలోకి మారింది.

సదరన్ మూవీస్ స్టూడియోలో పనిచేస్తూనే పెత్తందారి వ్యవస్థపై పునాదిరాళ్లు పేరుతో రాజ్ కుమార్ కథను సిద్ధం చేసుకున్నారు. డైరెక్టర్​గా ఆ స్టూడియో రాజ్ కుమార్​కు అవకాశం ఇచ్చింది. కానీ దురదృష్టవశాత్తు యూనియన్ల గొడవల వల్ల సదరన్ స్టూడియో మూతపడింది. పునాదిరాళ్లు కథను తీయడానికి నిర్మాతల కోసం తిరుగుతున్న సమయంలో నటుడు జగ్గయ్య పరిచయమయ్యారు. ఈ కథను కలర్​లో తీయమని సూచించారు. తన మిత్రుడు సహకారంతో మద్రాసు వెళ్లి సినిమా మొదలుపెట్టిన రాజ్ కుమార్​కు అక్కడే సుధాకర్, వరప్రసాద్( చిరంజీవి) పరిచయమయ్యారు. వరప్రసాద్ పట్టుపట్టడం వల్ల రాజ్ కుమార్ పునాదిరాళ్లలో ఐదుగురు యువకుల్లో ఒక పాత్రకు అవకాశం ఇచ్చారు. అలా చిరంజీవికి అవకాశం ఇచ్చిన తొలి దర్శకుడిగా రాజ్ కుమార్ పేరు చిత్ర పరిశ్రమ రికార్డుల్లోకెక్కింది.

వాణిజ్య అంశాలు ఏమీ లేకున్నా... చక్కటి కథ, కథనాలు ఉండటంతో ప్రేక్షకులు పునాదిరాళ్లను బ్రహ్మాండమైన విజయాన్ని చేకూర్చారు. ఫలితంగా ఆ సినిమా 5 నంది అవార్డులను అందుకుంది. ఆ తర్వాత మరెక్కడా రాజ్ కుమార్ పేరు గట్టిగా వినిపించలేదు. ఇందుకు కారణం... నిర్మాతలను వెతుక్కుంటూ వెళ్లకపోవడమే అన్నారు రాజ్ కుమార్. అదే తాను జీవితంలో చేసిన తప్పని ఆవేదన వ్యక్తం చేసిన.. ఏడెనిమిది సినిమాలు చేసినా పెద్దగా సంపాదించుకోలేకపోయానని వాపోయారు. ఉన్న భూమిని నమ్మినవాళ్ల చేతుల్లో పెడితే మోసం చేశారని, ఫలితంగా అద్దె ఇంట్లో ఉండాల్సి వచ్చిందని ఆవేదన వ్యక్తం చేశారు.

భార్య చనిపోవడం, కొడుకు గుండెపోటుతో మరణించడం, నమ్మినవాళ్లు మోసం చేయడం వల్ల రాజ్ కుమార్ తీవ్ర అనారోగ్యానికి గురై ఈరోజు తుదిశ్వాస విడిచారు.

Last Updated : Mar 1, 2020, 11:27 AM IST

For All Latest Updates

TAGGED:

ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.