యంగ్ రెబల్ స్టార్ ప్రభాస్, శ్రద్ధాకపూర్ ప్రధాన పాత్రల్లో తెరకెక్కిన చిత్రం 'సాహో'. ఆగస్టు 15న విడుదలవబోతోన్న ఈ చిత్రం కోసం నిర్మాతలు భారీగానే ప్రమోషన్స్ చేస్తున్నారు. ఇందులో భాగంగా సినిమాలోని 'సైకో సయాన్' పాట టీజర్‌ను విడుదల చేసింది చిత్రబృందం.
తెలుగు, తమిళ, హిందీ, మలయాళ భాషల్లో విడుదలైన పాట ప్రస్తుతం నెట్టింట వైరల్‌గా మారింది. బాలీవుడ్ సంగీత దర్శకుడు తనిష్క్ బాగ్జి ఈ పాటను కంపోజ్ చేశాడు. పూర్తి పాట ఈ నెల 8న విడుదలవనుంది.
ఆగస్టు 15న విడుదలవబోతోన్న ఈ సినిమాకు సుజిత్ దర్శకత్వం వహించాడు. భారీ యాక్షన్ డ్రామాగా తెరకెక్కిన ఈ సినిమా కోసం ప్రేక్షకులు ఆత్రుతగా ఎదురుచూస్తున్నారు.
- " class="align-text-top noRightClick twitterSection" data="">
ఇవీ చూడండి.. సల్మాన్‌ఖాన్‌కు న్యాయస్థానం హెచ్చరిక