ఈ ఏడాది సినీప్రేక్షకులకు థియేటర్ అనుభూతి అందించేందుకు ప్రముఖ నిర్మాణ సంస్థ యశ్‌రాజ్ ఫిల్మ్స్ ప్రణాళిక రచించింది. తమ బ్యానర్లో రూపొందిందిన సినిమాలను వరుసగా విడుదల చేసేందుకు సిద్ధమైంది. సదరు సినిమాల రిలీజ్ తేదీలను అధికారికంగా ప్రకటించింది. ఇంతకీ ఆ సినిమాలు ఏంటంటే?
'సందీప్ ఔర్ పింకీ ఫరార్' మార్చి 19న విడుదల చేయనున్నట్లు తెలిపింది. అర్జున్ కపూర్, పరిణీతి చోప్రా జంటగా నటించిన ఈ సినిమాను దివాకర్ బెనర్జీ తెరకెక్కించారు.
- " class="align-text-top noRightClick twitterSection" data="">
'బంటీ ఔర్ బబ్లీ 2'.. ఏప్రిల్ 23న విడుదల కానుంది. ఇందులో సైఫ్ అలీ ఖాన్, రాణీ ముఖర్జీ, సిద్ధాంత్ చతుర్వేది, శర్వారీ నటించారు. ఈ చిత్రానికి వరుణ్ వి. శర్మ దర్శకత్వం వహించారు.
- " class="align-text-top noRightClick twitterSection" data="">
రణ్‌బీర్ కపూర్, వాణీకపూర్, సంజయ్ దత్ ప్రధాన పాత్రలో నటించిన సినిమా 'షంషేరా'ను జూన్ 25న విడుదల చేయనున్నట్లు ప్రకటించింది. కరణ్ మల్హోత్రా ఈ చిత్రాన్ని తెరకెక్కించారు.
- " class="align-text-top noRightClick twitterSection" data="">
దివ్యాంగ్ థక్కర్ తెరకెక్కించిన 'జయేష్ భాయ్ జోర్దార్' సినిమాను ఆగస్టు 27న విడుదల చేయనుంది. ఇందులో రణ్వీర్ సింగ్, షాలినీ పాండే, బొమన్ ఇరానీ, రత్న పథక్ షా ప్రధాన పాత్రలో నటించారు.
- " class="align-text-top noRightClick twitterSection" data="">
అక్షయ్‌కుమార్ నటించిన 'పృథ్వీరాజ్' సినిమా నవంబరు 5న విడుదల కానుంది. ఇందులో అక్షయ్‌తో పాటు మానుషీ చిల్లర్, సంజయ్ దత్, సోనూ సూద్ నటించారు. చంద్రప్రకాశ్ ద్వివేది దర్శకత్వం వహించారు.
- " class="align-text-top noRightClick twitterSection" data="">
ఇదీ చూడండి: బికినీలో సన్నీ.. క్యూట్‌గా పూజా హెగ్డే.. హాట్‌గా ఈషా రెబ్బా