కోలీవుడ్ స్టార్ హీరో సూర్య, దర్శకురాలు సుధా కొంగర కాంబినేషన్లో రూపొందిన 'సూరారై పొట్రు' చిత్రం ఆస్కార్ రేసులో నిలిచింది. అకాడమీ అవార్డుల స్క్రీనింగ్ రూమ్లో ప్రదర్శించనున్న 366 సినిమాల్లో ఈ చిత్రానికి చోటు దక్కింది. ఉత్తమ చిత్రం, ఉత్తమ నటుడు, ఉత్తమ నటి, ఉత్తమ దర్శకుడు సహా పలు విభాగాల్లో ఈ సినిమా పోటీ పడబోతోందని చిత్రబృందం స్పష్టం చేసింది.
గత నెలలో దీనిపై పలు రకాల ఊహాగానాలు వినిపించినా.. చిత్రబృందం తొలిసారి స్పందించింది. చిత్ర నిర్మాణ సంస్థకు చెందిన రాజశేఖర్ పాండియన్ ఇదే విషయాన్ని అధికారికంగా ప్రకటించారు.
-
.#SooraraiPottruJoinsOSCARS @Suriya_offl #SudhaKongara @gvprakash @Aparnabala2 @nikethbommi @editorsuriya @jacki_art @2D_ENTPVTLTD @PrimeVideoIN @SonyMusicSouth Best Actor & Best film eligibility lists 👍🏼👍🏼👍🏼 https://t.co/pftv9yLjgs https://t.co/IXKNMFq4PI
— Rajsekar Pandian (@rajsekarpandian) February 26, 2021 " class="align-text-top noRightClick twitterSection" data="
">.#SooraraiPottruJoinsOSCARS @Suriya_offl #SudhaKongara @gvprakash @Aparnabala2 @nikethbommi @editorsuriya @jacki_art @2D_ENTPVTLTD @PrimeVideoIN @SonyMusicSouth Best Actor & Best film eligibility lists 👍🏼👍🏼👍🏼 https://t.co/pftv9yLjgs https://t.co/IXKNMFq4PI
— Rajsekar Pandian (@rajsekarpandian) February 26, 2021.#SooraraiPottruJoinsOSCARS @Suriya_offl #SudhaKongara @gvprakash @Aparnabala2 @nikethbommi @editorsuriya @jacki_art @2D_ENTPVTLTD @PrimeVideoIN @SonyMusicSouth Best Actor & Best film eligibility lists 👍🏼👍🏼👍🏼 https://t.co/pftv9yLjgs https://t.co/IXKNMFq4PI
— Rajsekar Pandian (@rajsekarpandian) February 26, 2021
ఈ ఏడాది ఆస్కార్ అవార్డ్స్ వేడుకకుగాను ప్రపంచవ్యాప్తంగా 366 సినిమాలను అకాడమీ ఎంపిక చేసింది. అందులో సూర్య నటించిన 'సూరారై పొట్రు' సినిమా చోటు దక్కించుకుంది. ఆస్కార్ రేసులో నిలిచిన ఏకైక దక్షిణాది చిత్రంగా ఘనత వహించింది. ఈ అవార్డులకు సంబంధించిన ఓటింగ్ ప్రక్రియ మార్చి 5 నుంచి ప్రారంభంకానుంది.
ఇదీ చూడండి: ఆస్కార్ రేసులో సూర్య 'సూరారై పొట్రు'!