ETV Bharat / sitara

సమంత ప్రెగ్నెన్సీపై నిర్మాత షాకింగ్​ కామెంట్స్! - నాగచైతన్య

నాగ చైతన్య-సమంత(samchaitanya divorce) విడాకులు తీసుకోవడంపై స్పందించిన నిర్మాత నీలిమ గుణ ఓ షాకింగ్​ విషయాన్ని తెలిపారు. సమంత(samchaitanya news) ప్రెగ్నెన్సీపై మాట్లాడారు. ఏం చెప్పారంటే?

sam
సామ్​
author img

By

Published : Oct 9, 2021, 10:34 AM IST

Updated : Oct 9, 2021, 10:47 AM IST

టాలీవుడ్​ స్టార్​ కపుల్​ నాగచైతన్య-సమంత(samchaitanya divorce) ఇటీవల తమ వైవాహిక జీవితానికి స్వస్తి పలికారు. ఈ నేపథ్యంలో సోషల్​మీడియాలో సామ్​పై పలు పుకార్లు వచ్చాయి(samchaitanya news). 'సమంత పిల్లలను వద్దనుకుంది.. అబార్షన్​ కూడా చేయించుకుంది' ఆ రూమర్స్​లో ఒకటి.

దీనిపై తాజాగా స్పందించిన 'శాకుంతలం' నిర్మాత నీలిమ గుణ(shakuntalam movie producer) ఓ కొత్త విషయాన్ని బయటపెట్టారు. సామ్​ పిల్లల్ని కనేందుకు అంతా సిద్ధం చేసుకుందని, కానీ రెండు నెలల్లోనే ఏదో జరిగి ఉంటుందని చెప్పారు.

"శాకుంతలం(shakuntalam movie) సినిమా కోసం మా నాన్న(దర్శకుడు గుణశేఖర్​) సమంతను సంప్రదించారు. అయితే అప్పటికే ఆమె సినిమాలు చేయకూడదని నిర్ణయించుకుంది. ఫ్యామిలీ ప్లానింగ్​లో ఉన్నట్లు చెప్పింది. కానీ శాకుంతలం కథ నచ్చడం వల్ల కొన్ని షరతులు విధించి ఒప్పుకొంది. జులై, ఆగస్టు నాటికి చిత్రీకరణ పూర్తిచేయాలని కోరింది. మేము దానికి అంగీకరించాం. ఈ చిత్రం తర్వాత విరామం తీసుకుని, తల్లి కావాలని ఆమె కోరుకుంది. తన ప్రాధాన్యత అదేనని చెప్పింది. కానీ ఇప్పుడు చైతూ-సామ్​ విడిపోవడం షాకింగ్​గా ఉంది."

-నీలిమ గుణ, నిర్మాత.

ఒంటరిగా వదిలేయండి

కాగా, తనపై వస్తున్న రూమర్స్​పై శుక్రవారం స్పందించారు సమంత(samantha post) .. "నాపై మీరు చూపిస్తున్న సానుభూతికి కృతజ్ఞతలు. అయితే, కొందరు నన్ను వ్యక్తిగతంగా టార్గెట్‌ చేస్తూ రూమర్స్‌ వ్యాప్తి చేస్తున్నారు. నాకు ఎఫైర్స్‌ ఉన్నాయని, పిల్లల్ని వద్దనుకున్నానని, అబార్షన్‌ చేయించుకున్నానని, నేను అవకాశవాదినని అంటున్నారు. విడాకులు తీసుకోవడం అనేది ఎంతో బాధతో కూడుకున్నది. నన్ను ఒంటరిగా వదిలేయండి. వ్యక్తిగతంగా నాపై దాడి చేయడం నిర్దయతో కూడుకున్నదే. భవిష్యత్‌లో ఇలాంటి వాటిని ఎన్నటికీ సహించను" అని సమంత(Samantha latest news) ట్వీట్‌ చేశారు.

ఇదీచూడండి: ఎఫైర్స్ లేవు.. అబార్షన్ కాలేదు.. సమంత భావోద్వేగం

Last Updated : Oct 9, 2021, 10:47 AM IST
ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.