ETV Bharat / sitara

'థియేటర్లు తెరిచేందుకు అనుమతివ్వకపోతే ఉద్యమమే'

కరోనా పేరుతో థియేటర్లు తెరవడానికి అనుమతించకపోతే భవిష్యత్​లో ఉద్యమం వస్తుందని అన్నారు టాలీవుడ్​ దర్శకనిర్మాత నట్టి కుమార్​. ఈ నెల 15లోగా సినిమాహాళ్లు తెరవడానికి అనుమతివ్వాలని డిమాండ్​ చేశారు. మంగళవారం ఆయన పుట్టినరోజు సందర్భంగా.. చిత్రపరిశ్రమ ఎదుర్కొంటున్న పలు అంశాలపై ఆయన మాట్లాడారు.

Producer Natti Kumar About Theaters re-opening issue
'థియేటర్లు తెరవకపోతే ఉద్యమం వస్తుంది'
author img

By

Published : Sep 8, 2020, 7:50 AM IST

"లీజు యజమానులు, థియేటర్ల గుత్తాధిపత్యం చేస్తున్న కొద్దిమంది వ్యక్తుల లాబీయింగ్​ వల్లే థియేటర్లు తెరుచుకోవట్లేదు" అన్నారు నిర్మాత, చలనచిత్ర వాణిజ్యమండలి సంయుక్త కార్యదర్శి నట్టి కుమార్​. మంగళవారం ఆయన పుట్టినరోజు. ఈ నేపథ్యంలో సోమవారం హైదరాబాద్​లో సినిమా రంగంలో నెలకొన్న ప్రస్తుతం సమస్యలపై మాట్లాడారు.

"కొవిడ్​ పేరుతో థియేటర్లు తెరవకుండా ఇలాగే ఉంచితే ముందు ముందు అన్ని రాష్ట్రాల్లో థియేటర్ల యజమానుల నుంచి ఉద్యమం వస్తుంది. అందుకే ఈ నెల 15 కల్లా ఎట్టి పరిస్థితుల్లో థియేటర్లు తెరవాలని ప్రభుత్వాన్ని డిమాండ్​ చేస్తున్నాం. ఇప్పటికే సినిమా హాళ్లు మూసివేయడం వల్ల వేలాది మంది కార్మికులు నష్టపోయారు. చిన్న నిర్మాతలు రోడ్డున పడే పరిస్థితికొచ్చింది. థియేటర్లు పాడైయిపోతున్నాయి. పిఠాపురంలోని ఓ థియేటర్లో ఫర్నీచర్​ దొంగల పాలైంది. దీనికి బాధ్యులు ఎవరు? విమానాలు, రైళ్లు సీటింగ్​ కెపాసిటీ మార్చకుండానే నడిపిస్తున్నారు. కానీ, థియేటర్లకు వచ్చే సరికి రూల్స్​ ఎందుకు మారుతున్నాయి. అక్కడ లేనంత ప్రమాదం థియేటర్లలో ఏముందో చెప్పాలి. చిత్రీకరణలు లేక కష్టాలు ఎదుర్కొంటున్న సినీ కార్మికులను ఆదుకునేందుకు ఏ ప్రభుత్వం ఇంతవరకు ముందుకు రాలేదు. చిరంజీవి సీసీసీ తరపున కార్మికులకు నిత్యావసరాలు అందించారు. కానీ, రెండు తెలుగు రాష్ట్ర ప్రభుత్వాలు సినీ కార్మికుల కోసం ఒక్క పైసా ఖర్చు పెట్టలేదు. ఏ మీకు మా కార్మికులపై బాధ్యత లేదా? థియేటర్ల సాకుతో పెద్ద హీరోలు తమ చిత్రాలు ఓటీటీలో విడుదల చేయడం సరైన పద్ధతి కాదు. హీరోలందరికీ కోట్ల రూపాయలు మార్కెట్లు ఉన్నాయంటే దానికి కారణం థియేటర్లని గుర్తుంచుకోవాలి".

- నట్టి కుమార్​, టాలీవుడ్​ దర్శకనిర్మాత

నిర్మాతగా, దర్శకుడిగా ప్రస్తుతం తన నుంచి రానున్న సినిమాల గురించి మాట్లాడుతూ.. "దర్శక నిర్మాతగా రామ్​గోపాల్​ వర్మతో కలిసి కొన్ని చిత్రాలు తీయబోతున్నా. వర్మపై తీస్తున్న 'సైకో వర్మ' చిత్రాన్ని ఈ నెల 9న ప్రారంభించబోతున్నాం. దీంతో పాటు 'దెయ్యంతో సహవాసం' అనే మరో సినిమా తీయబోతున్నా. ప్రస్తుతం నా పిల్లలు చేస్తున్న 'దిశ: ఎన్​కౌంటర్​' సినిమా ముగింపు దశకు వచ్చింది. మరో ఆరు చిత్రాలు సెట్స్​పై ఉన్నాయి" అని వెల్లడించారు.

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.