ఒక అబ్బాయి పెళ్లికి.. చదువు, ఉద్యోగం, ఆస్తే అర్హత కాదని అంటున్నారు అక్కినేని వారసుడు అఖిల్(akhil akkineni movies). బొమ్మరిల్లు భాస్కర్ దర్శకత్వంలో జీఏ2 పిక్చర్స్ పతాకంపై నిర్మిచిన 'మోస్ట్ ఎలిజిబుల్ బ్యాచిలర్'తో(most eligible bachelor review) ఈ దసరా కానుకగా అక్టోబర్ 15న ప్రేక్షకుల ముందుకు రాబోతున్నారు. అఖిల్ సరసన పూజా హెగ్డే(pooja hegde movies) కథానాయికగా నటించగా... ఇప్పటికే విడుదలైన పాటలు, ప్రచార చిత్రాలకు ప్రేక్షకుల నుంచి మంచి స్పందన లభించింది.
ఈ సందర్భంగా ప్రేక్షకులకు కృతజ్ఞతలు తెలిపిన ఆ చిత్ర నిర్మాత బన్నీ వాసు.. నేటి యువతకు పెళ్లి పట్ల ఉన్న దృక్పథాన్ని మార్చే చిత్రం 'మోస్ట్ ఎలిజిబుల్ బ్యాచిలర్'(most eligible bachelor review) అవుతుందని అన్నారు. అన్ని వర్గాల ప్రేక్షకులను ఆకట్టుకునేలా తమ చిత్రం ఉంటుందని ఆశాభావం వ్యక్తం చేశారు.

ఇవీ చదవండి: