ETV Bharat / sitara

ఆ సమయంలో చాలా నేర్చుకున్నా: ప్రియాంకా చోప్రా

author img

By

Published : Dec 13, 2021, 7:41 AM IST

Citadel Movie Priyanka Chopra: స్టార్​ హీరోయిన్​ ప్రియాంకా చోప్రా నటిస్తున్న 'సిటాడెల్'​ వెబ్​సిరీస్​ చిత్రీకరణ పూర్తైంది. ఈ సిరీస్​ షూటింగ్​ సమయంలో ఎన్నో కొత్త విషయాలను నేర్చుకున్నట్లు తెలిపింది ప్రియాంక. చిత్రీకరణ కోసం చాలా కష్టపడినట్లు పేర్కొంది.

ప్రియాంక చోప్రా, Citadel Movie Priyanka Chopra
ప్రియాంక చోప్రా

Citadel Movie Priyanka Chopra: అంతర్జాతీయ నటిగా పేరుపొందిన ప్రియాంకా చోప్రా వేగంగా చిత్రాలు చేస్తోంది. అమెజాన్‌ స్టూడియోస్‌ భాగస్వామిగా 'అవెంజర్స్‌-ఎండ్‌గేమ్‌' దర్శకుడు ఆంటోని, జోయ్‌ రుసోతో కలిసి నిర్మిస్తున్న వెబ్‌సిరీస్‌ 'సిటాడెల్‌'. స్పై థ్రిల్లర్‌ జానర్‌లో రూపొందుతున్న ఈ సిరీస్‌ భారతదేశంలోనూ విడుదల కానుంది. దీన్ని వేరే నటులతో 'ఫ్యామిలీమెన్‌' దర్శక ద్వయం రాజ్‌-డీకే రూపొందించనున్నారు.

ప్రస్తుతం అమెరికాలో విడుదలయ్యే ఈ సిటాడెల్​ సిరీస్‌లో ప్రియాంక, రిచర్డ్‌ మ్యాడెన్‌ నటిస్తున్నారు. జనవరిలో మొదలైన దీని చిత్రీకరణ పూర్తైంది. ఈ సందర్భంగా ప్రియాంక మాట్లాడుతూ "సంవత్సర కాలం చాలా ఉత్సాహంగా, ఉత్తేజంగా గడిచిపోయింది. సిటాడెల్‌ షూటింగ్‌ సమయంలో ఎన్నో కొత్త విషయాలు నేర్చుకొన్నా. దీనికోసం చాలా కష్టపడాల్సి వచ్చింది. అయితే అంతిమ ఫలితం చూసుకున్నాక... ఆ మాత్రం కష్టం తప్పనిసరి అనిపించింది." అని చెప్పుకొచ్చింది. ప్రస్తుతం ఈమె హాలీవుడ్‌ చిత్రం 'ది మేట్రిక్స్‌-రీసరక్షన్‌'లో నటిస్తోంది.

ఇదీ చూడండి: భర్తను ఆటాడుకున్న ప్రియాంక.. విడాకుల రూమర్లకు చెక్!

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.