Priyanka Chopra: ఏళ్ల తరబడి చిత్రసీమలో సత్తా చాటే నాయికల సంఖ్య చాలా తక్కువగానే ఉంటుంది. అలాంటి నాయికల జాబితాలో ప్రియాంక చోప్రా కచ్చితంగా ఉంటుంది. బాలీవుడ్‌లో ఆమె అడుగుపెట్టి 18 ఏళ్లు గడిచిపోయాయి. ఈ ప్రయాణంలో ఎన్నో విజయాలు, జాతీయ పురస్కారాలు అందుకుందామె. తన జీవితంలో కీలకమైన అడుగు హాలీవుడ్. అక్కడా వరసగా సినిమాల్లో నటిస్తూ అంతర్జాతీయంగానూ సత్తా చాటుతోంది.
"ఈ రోజు నేను ఇలా ఉన్నానంటే కారణం నా నిర్ణయాలే. ఈ రోజు ఇక్కడ ఇలా ఉన్నందుకు ఎంతో గర్వపడుతున్నాను. ఇంకా నేను ప్రయాణించాల్సిన దూరం చాలా ఉంది. ఇప్పటివరకూ ఎన్నో ఎత్తుపల్లాలు చూశాను. ఏదీ అంత సులువుగా అయితే రాలేదు"అని చెబుతోంది ప్రియాంక.
ఇదీ చూడండి: Priyanka chopra: 'స్టార్డమ్ పక్కనపెట్టి.. అవకాశాల కోసం అలా'