ETV Bharat / sitara

అది నాకు రెండో ఇల్లు లాంటిది: ప్రియాంక - టొరంటో ఇంటర్నేషనల్​ ఫిల్మ్​ ఫెస్టివల్ బ్రాండ్​ అంబాసిడర్​

టొరంటో అంతర్జాతీయ చలన చిత్రోత్సవం-2020కు ప్రచారకర్తగా ఎంపికైంది నటి ప్రియాంకా చోప్రా. దీనికి బ్రాండ్​ రానున్న కాలంలోనూ అంబాసిడర్​గా కొనసాగాలని ఆకాంక్షించింది.

Priyanka Chopra proud to serve as ambassador of Toronto International Film Festival
అంతర్జాతీయ చిత్రోత్సవానికి ప్రచారకర్తగా ప్రియాంక
author img

By

Published : Jul 8, 2020, 4:10 PM IST

టొరంటో అంతర్జాతీయ చలనచిత్రోత్సవం-2020(టీఐఎఫ్​ఎఫ్​)కి ప్రచారకర్తగా బాలీవుడ్​ నటి ప్రియాంకా చోప్రా ఎంపికైంది. బ్రాండ్​ అంబాసిడర్లుగా ఇప్పటికే ఆహ్వానం పొందిన 50 మంది సినీప్రముఖుల జాబితాలో ఈమె చేరింది. ఈ విషయాన్ని తన ఇన్​స్టాగ్రామ్​లో వెల్లడిస్తూ.. టీఐఎఫ్​ఎఫ్​ తనకు రెండో ఇల్లు లాంటిదని రాసుకొచ్చింది.

"నా సినీప్రయాణంలో టీఐఎఫ్​ఎఫ్​ నాకు రెండో ఇల్లులాంటిది. నేను నటిగా, నిర్మాతగా చేసిన చాలా చిత్రాలను ఈ వేడుకలో ప్రదర్శించారు. వైవిధ్యమైన కథలను ప్రదర్శించడం, గ్లోబల్​ కంటెంట్​కు మద్దతు ఇవ్వడం సహా అలాంటి కథలు విజేతలుగా నిలిచేందుకు టీఐఎఫ్​ఎఫ్​ ఎప్పుడూ సహకరిస్తుంది. ఈ ఏడాది దీనికి ప్రచారకర్తగా ఎంపికవ్వడం ఎంతో గర్వంగా ఉంది. ఈ విలువైన బంధాన్ని ఇకపైనా కొనసాగించాలని అనుకుంటున్నాను"

- ప్రియాంకా చోప్రా, బాలీవుడ్​ నటి

కరోనా వ్యాప్తి కారణంగా ఈ చిత్రోత్సవం ఆన్​లైన్​ వేదికల్లో లేదా వర్చువల్​గా నిర్వహించాలని నిర్ణయించింది టొరంటో ఇంటర్నేషనల్​ ఫిల్మ్​ఫెస్టివల్​. ఈ కార్యక్రమం సెప్టెంబరు 10 నుంచి 19 మధ్య జరగనుంది

ఇదీ చూడండి... ఇన్​స్టాలో దీపికా పదుకొణె మరో రికార్డు

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.