ప్రముఖ నటి ప్రియాంక చోప్రా, పాప్ సింగర్ నిక్ జోనాస్.. గురువారం తమ వివాహ రెండో వార్షికోత్సవాన్ని జరుపుకొన్నారు. ఈ సందర్భంగా ఇన్స్టాలో ఆసక్తికర పోస్ట్ పెట్టారు నిక్. 2018 డిసెంబరు 2న క్రిస్టియన్ సంప్రదాయ ప్రకారం పెళ్లి జరగ్గా.. ఆ తర్వాత రోజు (డిసెంబరు 3న) జోద్పుర్లో హిందూ సంప్రదాయం ప్రకారం ఒక్కటయ్యారు.
- " class="align-text-top noRightClick twitterSection" data="
">
"రెండు రోజులు చేసుకున్న పెళ్లి.. నేటితో(డిసెంబరు 3) రెండేళ్లు పూర్తి చేసుకుంది. ప్రియాంకను తన దేశంలో హిందూ సంప్రదాయంలో పెళ్లి చేసుకోవడం నాకు దక్కిన గౌరవం. సమయం ఎంతో త్వరగా గడిచిపోయింది. నేను ఎంతో అదృష్టవంతుడ్నో నమ్మలేకపోతున్నా. హిందూ పెళ్లిరోజు శుభాకాంక్షలు బ్యూటిఫుల్" అని నిక్ పోస్టు చేశారు.
దీనిపై స్పందించిన ప్రియాంక.. "నా నిజజీవిత బాలీవుడ్ హీరో. ఐ లవ్ యూ హ్యాండ్సమ్" అని నిక్కు రిప్లై ఇచ్చింది. తమ పెళ్లి ఫొటోలను ఇన్స్టాలో పోస్ట్ చేసింది.