సోషల్ మీడియాలో సెలబ్రిటీలకు అప్పుడప్పుడు ఇబ్బందికరమైన సంఘటనలు ఎదురవుతూ ఉంటాయి. ముఖ్యంగా హీరోయిన్ల విషయంలో అలాంటి పరిస్థితి కాస్త ఎక్కువగానే కనిపిస్తుంది. కొంతమంది ఆకతాయిలు అభ్యంతరమైన కామెంట్లు పెడుతూ వాళ్లను ఇబ్బంది పెడుతుంటారు. ఇటీవల ఓ నెటిజన్ నుంచి హీరోయిన్ పూజాహెగ్డే ఇలాంటి సంఘటన ఎదుర్కొంది. తాజాగా మరో నటి ప్రియమణికి కూడా ఇలాంటి పరిస్థితే ఎదురైంది. అయితే.. తన పోస్టుపై అభ్యంతరమైన కామెంట్ చేసిన ఆ నెటిజన్‌కు ప్రియమణి కాస్త ఘాటుగానే బదులిచ్చింది. ఇంతకీ ఏమైందంటే..
నటి ప్రియమణి ఇటీవల నలుపు రంగు దుస్తుల్లో ఒక ఫొటోషూట్‌లో పాల్గొంది. దానికి సంబంధించిన చిత్రాలు ఇన్‌స్టాగ్రామ్‌లో పంచుకుంది. అయితే.. ఆ పోస్టుల్లో ఒకదానిపై ఓ నెటిజన్ అభ్యంతరకరంగా కామెంట్ చేశాడు. నగ్నచిత్రం పోస్టు చేయమని ప్రియమణిని అడిగాడు.
దీనికి ఆమె స్పందిస్తూ.. "మొదట మీ సోదరి లేదా తల్లిని పోస్టు చేయమని అడుగు.. ఆ తర్వాత నేను పోస్టు చేస్తా" అంటూ ఆమె బదులిచ్చింది. దీంతో తన తప్పు తెలుసుకున్న సదరు వ్యక్తి క్షమాపణలు కోరుతూ మరో కామెంట్ చేశాడు. ప్రస్తుతం ఈటీవీలో ప్రసారమయ్యే 'ఢీ' కార్యక్రమంలో జడ్జీగా వ్యవహరించడం సహా పలు సినిమాల్లోనూ నటిస్తోంది. తెలుగులో నారప్ప, విరాటపర్వం, సైనైడ్ చిత్రాలతో పాటు హిందీ, తమిళ, కన్నడ చిత్రాల్లోనూ కీలకపాత్ర పోషిస్తోంది.
ఇదీ చూడండి: స్టైలిష్‌గా ప్రియమణి.. డిఫరెంట్ లుక్‌లో సోనమ్