యువ కథానాయిక ప్రియా ప్రకాష్ వారియర్ తన ఇన్‌స్టాగ్రామ్‌లో తాజాగా ఓ వీడియో షేర్ చేసింది. అందులో ఇటీవలే కారు ప్రమాదంలో గాయపడిన తన స్నేహితుడైన నకుల్ థంపి చేతిని నిమురుతూ ఓదారుస్తోంది. డాన్సర్‌గా గుర్తింపు పొంది ఇటీవలే నటుడిగా మారాడు నకుల్.
"నకుల్ కోలుకోవాలని ప్రార్థనలు చేస్తున్న వారందరికీ ధన్యవాదాలు. అతడి గురించి ఆలోచిస్తున్న శ్రేయోభిలాషులందరికీ నకుల్ తన ప్రేమను, కృతజ్ఞతను తెలియజేశాడు" అని పోస్టు చేసింది ప్రియా వారియర్.
- " class="align-text-top noRightClick twitterSection" data="
">
నకుల్ పుట్టినరోజు సందర్భంగా ప్రియ ఇటీవలే ఓ భావోద్వేగ పోస్టును షేర్ చేసింది. వారిద్దరిదీ బలమైన స్నేహమని అందులో పేర్కొంది.
- " class="align-text-top noRightClick twitterSection" data="
">