ETV Bharat / sitara

'ఆ అదృష్టాన్ని కాపాడుకోవడం కోసం శ్రమిస్తున్నా' - priya prakash over night star

'ఓరు అదార్‌ లవ్'‌ సినిమాలో కన్నుగీటి ఓవర్​నైట్​ స్టార్​గా ఎదగడం తన అదృష్టమని చెప్పారు నటి ప్రియా ప్రకాశ్​. ప్రస్తుతం ఆ అదృష్టాన్ని కాపాడుకోవడానికి శ్రమిస్తున్నట్లు తెలిపారు.

priya
ప్రియా ప్రకాశ్​
author img

By

Published : Mar 3, 2021, 8:11 PM IST

తొలి సినిమాలో కన్నుగీటి ఓవర్‌నైట్‌లోనే స్టార్‌గా మారి ఎంతో మంది అభిమానులను సొంతం చేసుకోవడం నిజంగానే తన అదృష్టమని నటి ప్రియా ప్రకాశ్‌ వారియర్‌ అన్నారు. 'ఓరు అదార్‌ లవ్‌'తో నటిగా ఎంట్రీ ఇచ్చిన ఈ కేరళ కుట్టి ఇటీవల విడుదలైన 'చెక్‌'తో తెలుగు ప్రేక్షకులను మెప్పించారు. ఈ నేపథ్యంలో ప్రియా ప్రకాశ్‌ తాజాగా ఓ ఇంటర్వ్యూలో పాల్గొన్నారు.

"ఓరు అదార్‌ లవ్‌లోని ఓ సన్నివేశంతో సోషల్‌మీడియా వేదికగా ఓవర్‌నైట్‌లోనే ఎంతోమంది అభిమానులను సొంతం చేసుకోవడం నా అదృష్టం. ఆ అదృష్టాన్ని కాపాడుకోవడానికి ఇప్పుడు శ్రమిస్తున్నాను. ఆ సినిమా విడుదలై మూడేళ్లు అవుతున్నప్పటికీ నాపై ప్రేక్షకులు చూపించే ప్రేమ ఏమాత్రం తగ్గలేదు. అందుకు నాకెంతో ఆనందంగా ఉంది. ప్రస్తుతం నేను కన్నడలో ఓ ప్రాజెక్ట్‌ చేస్తున్నా. తెలుగు కంటే కన్నడ మాట్లాడడం కొంచెం కష్టంగా ఉంటుంది. ప్రస్తుతం పలు సినిమా ఆఫర్స్‌ వస్తున్నాయి. మంచి కథలను మాత్రమే ఎంచుకోవాలనుకుంటున్నా" అని ఆమె వివరించారు.

ఇదీ చూడండి: 'నా నటనతో... ఆ పేరు మార్చేసుకుంటా'

ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.