"ఒక నటి ముందడుగు వేయడానికి కాస్త ప్రోత్సాహం చాలు. అలాంటిది తెలుగు ప్రేక్షకులు నాపైన ఎంతో ప్రేమను ప్రదర్శిస్తుంటారు. హైదరాబాద్ ఎప్పుడూ నా రెండో ఇల్లు అని భావిస్తుంటా" అని అంటోంది ప్రియా ప్రకాశ్ వారియర్. కన్నుకొట్టే వీడియోతో సంచలనం సృష్టించిన ఆమె ప్రపంచం మొత్తానికీ పరిచయం. తెలుగులో 'లవర్స్‌డే', 'చెక్' చిత్రాలతో సందడి చేసింది. ఇటీవల 'ఇష్క్'లో నటించింది. ఆ చిత్రం ఈ నెల 30న ప్రేక్షకుల ముందుకు రానుంది. ఈ సందర్భంగా ప్రియా ప్రకాశ్ మంగళవారం హైదరాబాద్‌లో విలేకర్లతో ముచ్చటించింది. ఆ విషయాలివీ...
"ఇది నా తొలి తెలుగు సినిమా అనిపిస్తోంది. ఎందుకంటే 'చెక్'లో నేను చేసింది చిన్న పాత్రే. 20 నిమిషాలకు మించి కనిపించను. ఇందులో సినిమా మొత్తం కనిపిస్తా. నిజానికి 'ఇష్క్' అనూహ్యంగా వచ్చిన అవకాశం. మామూలుగా కథ విన్నాక కొంచెం ఆలోచించి, దర్శకుడితో చర్చించి ఆ తర్వాత నిర్ణయం తీసుకుంటాం. ఈ సినిమాకు మాత్రం రెండు రోజుల్లోనే నిర్ణయం తీసుకొని సెట్లోకి అడుగుపెట్టా. మలయాళం 'ఇష్క్' నేను చూశా. అది నాకు బాగా నచ్చింది. దాంతో ఎక్కువగా ఆలోచించకుండా రంగంలోకి దిగా".
"మనం తరచూ చూసే ప్రేమకథల్లా ఉండదు ఈ చిత్రం. ప్రేక్షకుల్ని థ్రిల్ చేస్తుంది. యువతరం తమ జీవితాల్లో ఎదుర్కొనే ఓ కీలకమైన సమస్యను స్పృశిస్తుంది. ఆ సమస్య ఏమిటనేది తెరపైనే చూడాలి. దర్శకుడు ఇందులోని అను పాత్రను నాదైన శైలిలోనే చేయమని చెప్పారు. అదే చేశా. ప్రేక్షకులకు నా నటన కచ్చితంగా నచ్చుతుందని నమ్ముతున్నా".
"ఒక రాత్రిలో జరిగే కథ ఇది. గాఢతతో కూడిన సన్నివేశాలు ఇందులో ఉంటాయి. వాటి కోసం సినిమా మొత్తం ప్రత్యేకమైన భావోద్వేగాలతో నటించాల్సి వచ్చింది. కథానాయకుడు తేజ సజ్జా ఈ సినిమాతోనే నాకు పరిచయం. ఎప్పుడూ హుషారుగా ఉంటూ, సెట్లో అందరినీ అలాగే ఉంచుతుంటాడు తను. భాష విషయంలో చక్కటి సహకారం అందించాడు".
* "జరిగే ప్రతి విషయం వెనకా ఓ బలమైన కారణం ఉంటుందనీ.. సరైన సమయం వచ్చినప్పుడు సరైనవన్నీ జరుగుతాయనీ నమ్ముతా. కన్నుకొట్టే వీడియో వైరల్ అయిన తర్వాత నాకు చాలా అవకాశాలు వచ్చాయి. కానీ అప్పుడు కాలేజీకి వెళుతున్నా"
సినిమానూ, చదువుని బ్యాలెన్స్ చేయాల్సి వచ్చింది. దాంతో చాలా పెద్ద ప్రాజెక్ట్‌లు వదులుకోవల్సి వచ్చింది. అలాగని వాటి గురించి ఆలోచిస్తూ కూర్చుంటే ముందుకు వెళ్లలేం కదా. ఆ తర్వాత వచ్చిన అవకాశాల్ని స్వీకరిస్తూ అడుగులేశా. వరుసగా సినిమాలు చేస్తున్న సమయంలో కరోనా వచ్చింది. దాంతో నేనొక్కదాన్నే కాదు, ప్రపంచమంతా ఆగిపోయింది. ఇటీవలే బీకాం డిగ్రీ పూర్తయింది. పై చదువులకు వెళ్లే ఉద్దేశమేమీ లేదు. తెలుగులో ఒకటి, హిందీలో రెండు చిత్రాలను అంగీకరించా.
- " class="align-text-top noRightClick twitterSection" data="">
ఇవీ చదవండి: