ETV Bharat / sitara

తెలుగులో పాట పాడిన ప్రియా ప్రకాశ్​​! - తెలుగులో పాట పాడిన ప్రియా ప్రకాశ్​ వారియర్​

మలయాళీ ముద్దుగుమ్మ ప్రియా ప్రకాశ్​ వారియర్​.. తొలిసారి తెలుగులో సంగీత దర్శకుడు శ్రీ చరణ్‌ పాకాల రూపొందిస్తోన్న ఓ ప్రైవేటు ఆల్బమ్‌లో పాట పాడిందని తెలిసింది. త్వరలోనే ఈ గీతం విడుదల కానుంది. ప్రస్తుతం నితిన్‌ సరసన 'చెక్‌' చిత్రంలో నటిస్తోందీ భామ.

priya
ప్రియా ప్రకాశ్​
author img

By

Published : Jan 2, 2021, 9:19 PM IST

కన్నుగీటి యువ హృదయాల్ని కొల్లగొట్టి ఒకే ఒక రాత్రిలో సంచలనం సృష్టించింది మలయాళీ ముద్దుగుమ్మ ప్రియా ప్రకాశ్‌ వారియర్‌. నటిగానే కాకుండా తనలోని సింగర్​ను అప్పుడప్పుడు బయటపెడుతుంటుంది. అయితే తాజాగా తెలుగులోనూ గాయనిగా తన అదృష్టాన్ని పరీక్షించుకోబోతుందీ ముద్దుగుమ్మ. సంగీత దర్శకుడు శ్రీ చరణ్‌ పాకాల రూపొందిస్తోన్న ఓ ప్రైవేటు ఆల్బమ్‌లో ఈమె పాట పాడిందని తెలిసింది. త్వరలోనే ఇది విడుదల కాబోతుందని సమాచారం. ఇప్పటికే మలయాళం, కన్నడ భాషల్లో పాటలను ఆలపించింది ప్రియా. ఈ విషయం తెలిసిన ఆమె తెలుగు అభిమానులు.. ఈ గీతం కోసం ఎంతో ఆత్రుతగా ఎదురుచూస్తున్నారు.

'ఒరు అదార్‌ లవ్'తో తెరంగేట్రం చేసిన ఈ భామ ఒక్క సినిమాతోనే దేశవ్యాప్తంగా గుర్తింపు సంపాదించుకుంది. దీంతో అన్ని చిత్ర పరిశ్రమల వాళ్లు ప్రియతో సినిమా చేసేందుకు ఆసక్తి చూపుతున్నారు. ప్రస్తుతం ఆమె తెలుగులో నితిన్‌ సరసన 'చెక్‌' చిత్రంలో నటిస్తోంది. ఈ చిత్రానికి చంద్రశేఖర్ ఏలేటి దర్శకుడు.

ఇదీ చూడండి : బోల్డ్​ పాత్రతో కన్నడలోకి ప్రియా వారియర్

ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.