క్రికెట్ బాగా ఇష్టపడే వారిలో మన టాలీవుడ్ స్టార్లు చాలా మంది ఉన్నారు. టీమిండియా ఎక్కడ మ్యాచ్లు ఆడినా రెక్కలు కట్టుకొని మరీ అక్కడ వాలిపోతుంటారు. ముఖ్యంగా వెంకటేశ్, మహేశ్ బాబు, సురేశ్ బాబు వంటి వారికి క్రికెట్ అంటే ఎనలేని అభిమానం. ప్రస్తుతం వరల్డ్టూర్లో ఉన్న మహేశ్... ఆదివారం జరగబోయే ఆస్ట్రేలియా-భారత్ క్రికెట్ మ్యాచ్ వీక్షించేందుకు కుటుంబ సమేతంగా వెళ్లారని సమాచారం. దీనికి మరింత బలం చేకూరుస్తూ లండన్లో ఉన్నట్లు ఓ ఫొటోను సోషల్మీడియాలో పంచుకున్నాడు ప్రిన్స్ మహేశ్.
![prince mahesh babu in australia vs bharat match](https://etvbharatimages.akamaized.net/etvbharat/prod-images/3510131_mahesh.jpg)