ETV Bharat / sitara

మోదీ జీవితాధారంగా రూపొందుతున్న 'మనోవిరాగి' - మోదీ

ప్రధాని నరేంద్ర మోదీ జీవితాధారంగా తెలుగులో రూపొందుతున్న చిత్రం 'మనోవిరాగి'. గురువారం మోదీ పుట్టినరోజు సందర్భంగా ఈ చిత్రానికి సంబంధించిన టైటిల్​ పోస్టర్​ను విడుదల చేసింది చిత్రబృందం.

Prime Minister Narendra Modi's Biopic 'Manoviragi' Poster Released
మోదీ జీవితాధారంగా రూపొందుతున్న 'మనోవిరాగి'
author img

By

Published : Sep 18, 2020, 9:01 AM IST

భారత ప్రధాని నరేంద్ర మోదీ జీవితాధారంగా తెలుగు, తమిళ భాషల్లో ఓ చిత్రం తెరకెక్కుతోంది. టైటిల్‌ పాత్రలో అభయ్‌ వర్మ నటిస్తున్నారు. దీనికి తెలుగులో 'మనోవిరాగి'గా, తమిళంలో 'కర్మయోగి'గా పేర్లు నిర్ణయించారు. గురువారం మోదీ పుట్టినరోజు సందర్భంగా ఈ చిత్ర టైటిల్‌ పోస్టర్లను విడుదల చేశారు.

Prime Minister Narendra Modi's Biopic 'Manoviragi' Poster Released
మోదీ పాత్రధారుడు అభయ్​ వర్మ

చిత్ర సమర్పకులు ఎ.సుభాస్కరన్‌ మాట్లాడుతూ.. "ప్రధాని మోదీ టీనేజ్‌ జీవితంలోని ముఖ్యమైన మలుపులతో తెరకెక్కుతోన్న చిత్రమిది. మోదీ స్వరాష్ట్రం గుజరాత్‌లోని వాద్‌ నగర్‌, ఉత్తరాఖండ్‌ రాష్ట్రంలోని ప్రదేశాలలో ఈ సినిమా చిత్రీకరణ జరిపాం. ప్రస్తుతం నిర్మాణాంతర కార్యక్రమాలు జరుగుతున్నాయి. త్వరలోనే ప్రేక్షకుల ముందుకు తీసుకొస్తాం" అని తెలిపారు.

'మనోవిరాగి' చిత్రీకరణలోని దృశ్యం

తెలుగు, తమిళ భాషల్లో తెరకెక్కుతోన్న ఈ చిత్రానికి ఎస్‌.సంజయ్‌ త్రిపాఠీ దర్శకుడు. లైకా ప్రొడక్షన్స్‌ సమర్పణలో ప్రముఖ బాలీవుడ్‌ దర్శకుడు సంజయ్ ‌లీలా భన్సాలీ, మహవీర్‌ జైన్‌ నిర్మిస్తున్నారు.

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.