బాలీవుడ్ అందాల నటి ప్రీతి జింతా.. ఈ ఏడాది చాలా ఆసక్తికర విషయాలు పంచుకోనున్నట్లు చెప్పింది. ఈ సందర్భంగా బ్యాట్ పట్టుకుని ఉన్న త్రో బ్యాక్ ఫొటోను ఇన్స్టాలో పోస్ట్ చేసింది. "ఈ ఏడాది సరికొత్త ఆరంభానికి నాంది. ఆసక్తికర, ఉత్సాహం కలిగించే విషయాలు మీ ముందుకు రానున్నాయి. ఎవరైనా అవేంటో ఊహించగలరా?" అనే వ్యాఖ్యతో నెటిజన్లకు సవాలు విసిరింది.
- " class="align-text-top noRightClick twitterSection" data="
">
ప్రీతి చెప్పింది ఏ విషయమై ఉంటుందా? అని నెటిజన్లు తెగ చర్చించుకుంటున్నారు. 'బాలీవుడ్లోకి రీఎంట్రీ ఇవ్వనుందా', 'హృతిక్ రోషన్తో సినిమా చేయనుందా', 'మహిళా క్రికెటర్గా కొత్త సినిమాలో నటిస్తుందా?', 'ఐపీఎల్లో పంజాబ్ జట్టు గురించి ఏమైనా కొత్త విషయం చెప్పనుందా?, 'ఐపీఎల్లో కొత్త జట్టు ఏమైనా పెట్టనుందా?', 'రాజకీయాల్లోకి ప్రవేశించనుందా?' అంటూ కామెంట్లు పెడుతున్నారు.
ఇదీ చూడండి: ప్రీతి జింటా ఫ్యామిలీకి కరోనా.. నటి ఆవేదన