బాలీవుడ్ స్టార్ ప్రీతి జింతా (Preity zinta children), ఫైనాన్షియల్ ఎనలిస్ట్ జీన్ గుడ్ఇనఫ్ దంపతులు కవలపిల్లలకు తల్లిదండ్రులయ్యారు. సరోగసీ విధానం ద్వారా ఓ పుత్రుడు, పుత్రిక జన్మించారు. ఈ విషయాన్ని ట్విట్టర్ ద్వారా వెల్లడించింది ప్రీతి. తమ సంతానానికి జై, జియా అనే పేర్లు పెట్టినట్లు తెలిపింది.
"మాకు చాలా సంతోషంగా ఉంది. జై జింటా గుడ్ ఇనఫ్, జియా జింటా గుడ్ ఇనఫ్ కవలలను మా కుటుంబంలోకి ప్రేమతో ఆహ్వానిస్తున్నాం." అని ట్విట్టర్లో పేర్కొంది ప్రీతి. మెడికల్ బృందానికి, సరోగసి విధానంతో గర్భం దాల్చిన మహిళకు ధన్యవాదాలు తెలిపింది.
-
Hi everyone, I wanted to share our amazing news with all of you today. Gene & I are overjoyed & our hearts are filled with so much gratitude & with so much love as we welcome our twins Jai Zinta Goodenough & Gia Zinta Goodenough into our family. pic.twitter.com/wknLAJd1bL
— Preity G Zinta (@realpreityzinta) November 18, 2021 " class="align-text-top noRightClick twitterSection" data="
">Hi everyone, I wanted to share our amazing news with all of you today. Gene & I are overjoyed & our hearts are filled with so much gratitude & with so much love as we welcome our twins Jai Zinta Goodenough & Gia Zinta Goodenough into our family. pic.twitter.com/wknLAJd1bL
— Preity G Zinta (@realpreityzinta) November 18, 2021Hi everyone, I wanted to share our amazing news with all of you today. Gene & I are overjoyed & our hearts are filled with so much gratitude & with so much love as we welcome our twins Jai Zinta Goodenough & Gia Zinta Goodenough into our family. pic.twitter.com/wknLAJd1bL
— Preity G Zinta (@realpreityzinta) November 18, 2021
1998లో మణిరత్నం దర్శకత్వంలో తెరకెక్కిన 'దిల్ సే' సినిమాతో తెరంగేట్రం చేసింది ప్రీతి జింటా. 2016లో అమెరికా వ్యక్తి గుడ్ ఇనఫ్ను వివాహం చేసుకుంది. సోల్జర్, క్యా కెహ్నా, దిల్ చాహ్తా హై, కల్ హో నహో, కోయి మిల్గయా, వీర్ జారా వంటి చిత్రాలతో నటిగా మంచి పేరు సంపాదించుకుంది ప్రీతి జింటా.
ఇదీ చదవండి: