విలక్షణమైన నటనకు చిరునామా ప్రకాశ్‌రాజ్. హీరోగా మెప్పించాడు. విలన్‌గా భయపెట్టాడు. సహాయ నటుడిగా మురిపించాడు. ఇతడిలో నటుడే కాకుండా ఓ దర్శకుడు దాగి ఉన్నాడన్న సంగతి ప్రత్యేకంగా చెప్పాల్సిన పనిలేదు. ప్రకాశ్‌రాజ్ ప్రధాన పాత్రలో ప్రముఖ దర్శకుడు కృష్ణవంశీ 'రంగమార్తాండ' చిత్రాన్ని తెరకెక్కిస్తున్నాడు. రమ్యకృష్ణ, బ్రహ్మానందం తదితరులు కీలక పాత్రల్లో కనిపించబోతున్నారు. ప్రస్తుతం శరవేగంగా చిత్రీకరణ జరుపుకుంటోన్న ఈ చిత్రం కోసం ప్రకాశ్‌రాజ్ సహాయ దర్శకుడిగానూ మారారట. ఈ విషయాన్ని కృష్ణవంశీ ట్విటర్ వేదికగా అభిమానులతో పంచుకున్నాడు.
-
New asst director of my team .... godbless him pic.twitter.com/dBA9ERIyUS
— Krishna Vamsi (@director_kv) December 12, 2019 " class="align-text-top noRightClick twitterSection" data="
">New asst director of my team .... godbless him pic.twitter.com/dBA9ERIyUS
— Krishna Vamsi (@director_kv) December 12, 2019New asst director of my team .... godbless him pic.twitter.com/dBA9ERIyUS
— Krishna Vamsi (@director_kv) December 12, 2019
"నా బృందంలో కొత్త సహాయ దర్శకుడు. ఆశీర్వదించండి" అంటూ ప్రకాశ్‌రాజ్‌కు సంబంధించిన వీడియోను షేర్ చేశాడు. ఈ వీడియోలో మిగతా అసిస్టెంట్ డైరక్టర్లతో కలిసి ఫొటో ఫ్రేమ్‌లు గోడకు అతికించడంలో సహాయం చేస్తూ కనిపించాడు ప్రకాశ్‌రాజ్. ప్రతిరోజూ సెట్స్‌లో తన పాత్ర చిత్రీకరణ ముగిసిన వెంటనే ఇలా తోటి సాంకేతిక బృందానికి ఇలాగే పనిలో సహాయం చేస్తున్నారని చిత్రబృందం తెలిపింది.
రంగస్థల కళాకారుల తెర వెనుక జీవితాల కథతో ఈ చిత్రం తీస్తున్నారు. మరాఠీలో విజయవంతమైన 'నట సామ్రాట్' చిత్రానికి ఇది తెలుగు రీమేక్. వచ్చే ఏడాది ప్రధమార్థంలో ప్రేక్షకుల ముందుకు రాబోతుంది.


ఇది చదవండి: ప్రకాశ్‌రాజ్ కుమార్తెగా 'దొరసాని'..?