ETV Bharat / sitara

Prakash raj: 'మా' అధ్యక్ష పదవి రేసులో ప్రకాశ్​రాజ్​ - నాగబాబు చిరంజీవి

టాలీవుడ్​లో త్వరలోనే జరగనున్న మూవీ ఆర్టిస్ట్స్​ అసోసియేషన్​(Movie Artist Association-MAA) ఎన్నికల్లో అధ్యక్షుడిగా విలక్షణ నటుడు ప్రకాశ్​రాజ్​(Prakash raj) పోటీ చేయనున్నారు. దేశవ్యాప్తంగా 'మా'కు అత్యున్నత గౌరవం దక్కేందుకు తాను కృషి చేస్తానని చెప్పారు. అదే విధంగా 'మా' కార్యకలాపాలు నడిపేందుకు సొంత భవనాన్ని నిర్మిస్తానని హామీ ఇస్తున్నట్లు ఓ ఇంటర్వ్యూలో వెల్లడించారు.

Prakash Raj to contesting in Movie Artist Association election
Prakash raj: 'మా' అధ్యక్ష పదవి రేసులో ప్రకాశ్​రాజ్​
author img

By

Published : Jun 20, 2021, 6:19 PM IST

తెలుగు చిత్ర పరిశ్రమలో మరో రసవత్తర పోరుకు రంగం సిద్ధమైంది. త్వరలో జరగబోయే మూవీ ఆర్టిస్ట్స్‌ అసోసియేషన్‌(మా) ఎన్నికల్లో అధ్యక్షుడిగా విలక్షణ నటుడు ప్రకాశ్‌రాజ్‌(Prakash raj) బరిలో దిగనున్నారు. ఓ ఛానల్‌కు ఇచ్చిన ఇంటర్వ్యూలో ఈ విషయాన్ని ప్రకాశ్‌రాజ్‌ తెలిపారు. దీంతో ప్రకాశ్‌రాజ్‌కు పోటీగా ఎవరు బరిలోకి దిగుతారు? ఆయనకు ఎవరి మద్దతు ఉంటుంది? ఇలా అనేక అంశాలపై అడిగిన ప్రశ్నలకు ఆయన తనదైన శైలిలో సమాధానం ఇచ్చారు.

చిరంజీవి(Chiranjeevi) మద్దతు మీకు ఉంటుందని వార్తలు వినిపిస్తున్నాయి? మీరేమంటారు? అన్న దానికి ప్రకాశ్‌రాజ్‌ సమాధానం ఇస్తూ.. "చిరంజీవి అందరి వ్యక్తి. ఆయన వ్యక్తిగతంగా ఏ ఒక్కరికో మద్దతు ఇవ్వరు. మంచి చేస్తారని ఆయన భావించినవారికి మద్దతిస్తారు. అన్నయ్యతో నాకున్న సాన్నిహిత్యాన్ని దీని కోసం వినియోగించుకోను" అని సమాధానం ఇచ్చారు.

'నా వంతుగా..'

తెలుగు చిత్రపరిశ్రమలో ఉన్న సమస్యల గురించి తనకు పూర్తిగా అవగాహన ఉందని, వాటిని అధిగమించడానికి తన వద్ద సరైన ప్రణాళిక ఉందన్నారు. ఇతర చిత్ర పరిశ్రమలతో పోలిస్తే చాలా విషయాల్లో తెలుగు చిత్రపరిశ్రమ చాలా పెద్దదన్న ప్రకాశ్‌రాజ్‌.. ఒకప్పుడు ఉన్న పేరు ప్రఖ్యాతలు ఇప్పుడు లేవని, దేశవ్యాప్తంగా 'మా'(Movie Artist Association-MAA)కు అత్యున్నత గౌరవం తీసుకొచ్చేందుకు తనవంతు కృషి చేస్తానన్నారు.

భవన నిర్మాణానికి హామీ

'మా'కు ఇప్పటివరకూ సొంత భవనం లేదని, తాను అధ్యక్షుడిగా ఎన్నికైతే, 100 శాతం సొంత భవనం నిర్మిస్తానని హామీ ఇచ్చారు. సినీ కార్మికులకు సాయం చేయడానికి తెలుగు చిత్ర పరిశ్రమలో ఎంతోమంది సహృదయం కలిగిన నటులు ఉన్నారని, వాళ్లందరినీ ఒకతాటిపైకి తీసుకొస్తానని ప్రకాశ్‌రాజ్‌ తెలిపారు.

ప్రకాశ్‌రాజ్‌ భారతీయ నటుడు: నాగబాబు

ప్రకాశ్‌రాజ్‌ లాంటి వ్యక్తి 'మా' అసోసియేషన్‌ అధ్యక్షుడు అయితే, తెలుగు చిత్ర పరిశ్రమకు మంచి జరుగుతుందన్న నమ్మకం ఉందని నటుడు నాగబాబు(Nagababu) అన్నారు. అందుకు ఆయన దగ్గర తగిన ప్రణాళికలు ఉన్నాయన్నారు. ఆయన ఎన్నిక విషయంలో తమ వంతు సహకారం అందిస్తామని నాగబాబు తెలిపారు. ప్రకాశ్‌రాజ్‌ లాంటి వారు ఏ ఒక్క చిత్ర పరిశ్రమకో చెందినవారు కాదని, ఆయన భారతీయ నటుడని నాగబాబు అభిప్రాయపడ్డారు. రాజకీయంగా తమ మధ్య భిన్నాభిప్రాయాలు ఉన్నా, చిత్ర పరిశ్రమకు వచ్చేసరికి తామంతా ఒకటేనని తెలిపారు. ప్రకాశ్‌రాజ్‌ గెలుపునకు తన వంతు కృషి చేస్తానని నాగబాబు స్పష్టం చేశారు.

ఇదీ చూడండి.. Meenakshi Seshadri: 30 ఏళ్ల తర్వాత రీఎంట్రీ!

ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.