బుల్లితెర వ్యాఖ్యాత ప్రదీప్ మాచిరాజు ముగ్గురు ముద్దుగుమ్మలతో కలిసి స్టెప్పులేశారు. ప్రస్తుతం ఈ వీడియో నెట్టింట్లో వైరల్‌గా మారింది. ప్రదీప్ హీరోగా తెరకెక్కిన చిత్రం '30 రోజుల్లో ప్రేమించడం ఎలా?'. మున్నా దర్శకత్వం వహించిన ఈ సినిమాలో ప్రదీప్‌కు జంటగా అమృతా అయ్యర్ నటించారు. కరోనా పరిస్థితుల నేపథ్యంలో గతేడాది విడుదలకు నోచుకోని ఈ చిత్రం జనవరి 29న ప్రేక్షకుల ముందుకు రానుంది.
కాగా, తమ సినిమా విడుదలను తెలియజేస్తూ 'వావా మేరే బావా' అనే ప్రమోషనల్ పాటను తాజాగా చిత్రబృందం విడుదల చేసింది. ఇందులో ప్రదీప్.. బుల్లితెర వ్యాఖ్యాతలు అనసూయ, రష్మి, శ్రీముఖిలతో కలిసి మాస్ స్టెప్పులేసి ఆకట్టుకున్నారు. 'ఢీ' డ్యాన్స్‌షో ఫేమ్ చిట్టి మాస్టర్ కంపోజ్ చేసిన ఈ పాటను సింగిల్ టేక్‌లోనే చిత్రీకరించారు. ప్రస్తుతం ఈ వీడియో నెటిజన్లను ఎంతగానో ఆకట్టుకుంటోంది.
- " class="align-text-top noRightClick twitterSection" data="">