యాంకర్ ప్రదీప్ మాచిరాజు కథానాయకుడిగా నటించిన చిత్రం '30 రోజుల్లో ప్రేమించటం ఎలా?'. అమృతా అయ్యర్ కథానాయిక. ఫణి ప్రదీప్ (మున్నా) దర్శకత్వంలో, ఎస్వీ బాబు నిర్మించారు. ఈ నెల 29న చిత్రం ప్రేక్షకుల ముందుకొస్తున్న సందర్భంగా హైదరాబాద్‌లో విడుదలకి ముందస్తు వేడుక జరిగింది. అనిల్ రావిపూడి, మారుతి, కార్తికేయ, అడవి శేష్ ముఖ్య అతిథులుగా హాజరై ప్లాటినం డిస్క్‌లని చిత్రబృందానికి అందజేశారు.
- మున్నా కథ చెప్పినప్పుడు చేయగలనా అని భయం వేసింది. నువ్వు చేయగలవంటూ ప్రతి క్షణం నా వెంట ఉంటూ ప్రోత్సహించారు. పెద్ద స్థాయిలో ఖర్చు పెట్టి నిర్మించారు నిర్మాత. అనూప్ జీవితాంతం గుర్తుండిపోయే నీలి నీలి.. పాటనిచ్చారు. -ప్రదీప్, నటుడు
- అందరం కష్టపడి ఓ మంచి సినిమా చేశాం. ఓటీటీ వేదికల నుంచి ఎన్ని ఆఫర్లు వచ్చినా మా కష్టాన్ని గుర్తించి థియేటర్లలోనే విడుదల చేస్తున్నారు నిర్మాత. నాయకానాయికలు నా కలని నిజం చేస్తూ నటించారు. వారి పాత్రలు ప్రేక్షకుల్ని వెంటాడతాయి. - మున్నా, దర్శకుడు
- మా చిత్రాన్ని ప్రపంచవ్యాప్తంగా జీఏ2, యు.వి.సంస్థలు విడుదల చేస్తున్నాయి. సినిమా చూసుకున్నాక ఒక మంచి చిత్రం చేశానన్న తృప్తి కలిగింది. -నిర్మాత.
ఈటీవీ భారత్ లైవ్లో ప్రదీప్
శుక్రవారం ఈ సినిమా విడుదలబోతున్న నేపథ్యంలో ఈటీవీ భారత్ లైవ్ చాట్లో పాల్గొననున్నాడు ప్రదీప్. మధ్యాహ్నం 3 గంటలకు ఈ లైవ్ ప్రారంభంకానుంది.