ETV Bharat / sitara

అన్ని కోణాల్లోనూ అలుపెరగని బహుముఖ ప్రజ్ఞాశాలి

ఏ ముద్ర వేయని బ్యాక్‌గ్రౌండ్‌ డాన్సర్‌గా కెరీర్‌ ప్రారంభించిన ఓ యువకుడు భవిష్యత్తులో విజయ కేతనాలు ఎగురవేసి సినీ రంగానికి ఎనలేని విఖ్యాతిని తీసుకువస్తాడని ఎవరైనా కల గన్నారా? కొరియోగ్రాఫర్‌గా, యాక్టర్‌గా, దర్శకుడిగా, నిర్మాతగా, గాయకుడిగా, గేయ రచయితగా... ఇలా సకల కళల సమాహారమైన మూడక్షరాల సినిమాలో తనకంటూ ఓ పేజీ భద్రపరచుకున్న సృజనశీలి ఆయన. రంగుల ప్రపంచమే అతడి చిరునామా. 24 గంటల రోజులో 48 గంటలపాటు సినిమాయే ఆయన ధ్యాస! సినిమాయే శ్వాస.! సినిమాయే ఆయన ప్రాణం.. ప్రణవం... సర్వం.! ఆయనే ప్రభు దేవా. అభిమానుల దృష్టిలో ఇండియన్‌ మైఖేల్‌ జాక్సన్‌. నేడు ఆయన జన్మదినాన్ని పురస్కరించుకొని.. మరిన్ని విశేషాలు మీకోసం...

PRABHUDEVA BIRTHDAY SPECIAL STORY
అన్ని కోణాల్లోనూ అలుపెరగని బహుముఖ ప్రజ్ఞాశాలి
author img

By

Published : Apr 3, 2020, 6:39 AM IST

ప్రభుదేవా కొరియోగ్రాఫర్‌గా చిత్రసీమలోకి అడుగు పెట్టిన తరువాత సినీ నృత్యం కొత్త శైలిని అలవర్చుకుంది. అంతకు ముందులేని విధంగా కొంగ్రొత్తగా అడుగులు వేయడం మొదలెట్టింది. అవి పాదాలా.? జలపాతాలా..? అనే విధంగా నృత్యశైలిలో పెను మార్పులు చోటు చేసుకున్నాయి. నాయికానాయకులు ఎవరైనా... ప్రభుదేవా కొరియోగ్రఫీలో పదో వంతు ఆవాహన చేసుకుని ప్రదర్శన ఇస్తే చాలు.. వారి నృత్యానికి ప్రేక్షకులు మంత్రముగ్ధులై తీరుతారు. అసలు ప్రభు దేవా నృత్యంలోనే అవధుల్లేని వేగం, గుండె పట్టనంత ఉద్వేగం ఉన్నాయంటే అతిశయోక్తి కాదు. అందుకే సినీ నృత్యాన్ని ప్రభు దేవా రాకముందు... వచ్చిన తరువాత అనే విభజన రేఖతో ప్రేక్షకులు పరిశీలించడం అలవాటు చేసుకున్నారు.

PRABHUDEVA BIRTHDAY SPECIAL STORY
ప్రభుదేవా

శత చిత్రాలకు కొరియోగ్రఫీ

ప్రభు దేవా 1980 దశకంలో కొరియోగ్రాఫర్‌గా కెరీర్‌ ప్రారంభించి అలవోకగా వంద సినిమాలకు పనిచేసిన తరువాతే నటుడిగా తెరకు పరిచయమయ్యారు. ఎన్నో బ్లాక్‌బస్టర్‌ మూవీస్‌లో నాయకుడిగా నటించి సక్సెస్‌ సాధించిన తరువాత ఆయన కెరీర్‌లో మరో మలుపు వచ్చింది. దర్శకుడిగా ఆయన తన సత్తా చాటుకున్నారు. అంతటితో ఆగలేదు. నిర్మాతగా.. అభిరుచి గల సినిమాలను రూపొందించారు. ఇలా అనుక్షణం జ్వలించే తత్వం ఉన్న ఏ కళాకారుడయినా అందని ఆకాశాల్ని ఇట్టే ఈదేస్తాడని... విజయ శిఖరారోహణ చేసి చరిత్రలో స్థానాన్ని పదిలపరచుకుంటాడని ప్రభుదేవా జీవితమే చెబుతుంది.

సినీ జగం శిరసుకెత్తుకున్న బ్రాండ్​

కెరీర్‌ ప్రారంభంలో ఎన్ని కష్టాలు అనుభవించాడో, ఎన్ని కన్నీళ్లు దిగమింగుకున్నాడో, ఎన్ని అవమానాలు ఎదుర్కొన్నాడో తెలీదు. కానీ.. ఇప్పడు ప్రభుదేవా అంటే సినీ జగం శిరసుకెత్తుకున్న ఓ బ్రాండ్‌. ప్రభు దేవా అంటే ఓ ఇమేజ్‌. ఆయన సినిమా చేస్తానంటే క్యూలో నిలుచునే నిర్మాతలకు కొదవే లేదు. ఆయన కొరియోగ్రఫీలో ఒక్క పాటైనా చేయాలని కలలు కనే నవతరం హీరోహీరోయిన్​ల ఆశలకు హద్దులు లేవు.

ఇదీ ఆయన ప్రస్థానం

కర్ణాటక మైసూర్‌లో 1973 ఏప్రిల్‌ 3న జన్మించిన ప్రభుదేవా తండ్రి ముగుర్‌ సుందర్‌. తల్లి మహాదేవమ్మ. ముగుర్‌ సుందర్‌ కూడా... సుందరం మాస్టార్​గా సినీసీమకు సుపరిచితులే. కొరియోగ్రాఫర్‌గా ఆయన అప్పటి అగ్రహీరోలందరికీ సినీ నృత్యాన్ని నేర్పించారు. అతడు కొరియోగ్రఫీ చేసిన ఎన్నో పాటలు ఇప్పటి ప్రేక్షకులనూ ఆకట్టుకుంటున్నాయి. ప్రభుదేవా సోదరులు రాజు సుందరం, నాగేంద్ర ప్రసాద్‌ కూడా నృత్య కళాకారులే. తండ్రి సుందరం మాస్టారు స్ఫూర్తితో ప్రభు దేవా శాస్త్రీయ నృత్యాన్ని అభ్యసించారు. ధర్మరాజు, ఉడిపి లక్ష్మీ నారాయణన్‌ భరత నాట్యంలో ప్రభుదేవాకు గురువులు.

PRABHUDEVA BIRTHDAY SPECIAL STORY
ఇదీ ప్రభు దేవా ప్రస్థానం

'మౌనరాగం'తో తొలిసారి

అదే సమయంలో ప్రభు దేవా పాశ్చాత్య నృత్య రీతుల్లోనూ కావాల్సినంత అభినివేశాన్ని పొందారు. ఇటు భారతీయ నృత్యం, అటు వెస్టన్ర్‌ స్టైల్‌ మిక్స్‌ చేసిన ప్రభుదేవా.. తన ప్రత్యేకతను చాటుకున్నాడు. 1986లో రూపొందిన 'మౌన రాగం' అనే తమిళ చిత్రంలో ఫ్లూట్‌ వాయించే కుర్రాడిగా ప్రభుదేవా తొలిసారి తెరపై కనిపించారు. 1988లో తమిళంలోనే 'అగ్ని నక్షత్రం' అనే సినిమాలో ఓ పాటలో బ్యాక్‌గ్రౌండ్‌ డాన్సర్‌గా మరోసారి తెరపై తళుక్కుమన్నారు.

కమల్‌ హాసన్‌తో తొలి పాట

విలక్షణ నటుడు కమల హాసన్‌ చిత్రం 'వెట్రి విజహా'లో తొలిపాటకు కొరియోగ్రాఫర్‌గా పరిచయమయ్యారు ప్రభుదేవా. ఈ చిత్రం 1989లో విడుదలయింది. ఇక అప్పటినుంచి ఆయన వెనుదిరిగి చూసుకోలేదు. కొరియో గ్రాఫర్‌గా మూడు షిఫ్ట్‌ల్లో అవిశ్రాంతంగా పనిచేసి వంద సినిమాలను పూర్తి చేసుకున్నారు.

PRABHUDEVA BIRTHDAY SPECIAL STORY
కమల్​ హాసన్​తో ప్రభుదేవా

నటుడిగా నవ ప్రస్థానం

అడపాదడపా సినిమాల్లో, పాటల్లో కామెడీని పండిస్తూ వచ్చిన ప్రభు దేవా.. 1994లో పవిత్రం దర్శకత్వం వహించిన రొమాంటిక్‌ మూవీలో కథానాయకుడిగా నవ ప్రస్థానం ప్రారంభించారు. రోజా, శరత్‌ కుమార్‌ జంటగా నటించిన ఈ సినిమాలో కీలక పాత్ర పోషించడం వల్ల ప్రభుదేవాలోని నటుడికి అవకాశాలు అందివచ్చాయి. ఆ ఏడాదే శంకర్‌ దర్శకత్వంలో 'కాదలన్‌' చిత్రం ఘన విజయాన్ని సొంతం చేసుకుంది. అందులో హీరోయిన్‌ నగ్మా. ఈ చిత్రం 'ప్రేమికుడు'గా తెలుగు ప్రేక్షకులనూ విశేషంగా ఆకర్షించింది. హిందీలోనూ ఈ సినిమాను డబ్‌ చేశారు. అక్కడా తిరుగులేని విజయాన్నందుకుందీ సినిమా.

ఇప్పటికీ ఆ పాటలు ఓ బ్రాండ్​

ప్రేమను దక్కించుకోవడానికి ఎంతటి సాహసం చేయడానికయినా వెనుకాడని యువకుడిగా ప్రభుదేవా ఇందులో నటించి మెప్పించారు. ఏ.ఆర్‌.రెహమాన్‌ స్వరాలు సమకూర్చిన ఈ చిత్రంలోని పాటలు యావత్‌ భారత దేశాన్ని ఓ కుదుపు కుదిపేశాయి. ప్రత్యేకించి ముఖాబులా, ఊర్వశి.. ఊర్వశి అనే పాటలు ఇప్పటికీ ఎక్కడో అక్కడ మారు మోగుతూనే ఉన్నాయి. ప్రభు దేవా కొరియోగ్రఫీ కూడా ఈ సినిమాకి హైలెట్‌. ఇక అక్కడ నుంచి నటుడిగా ప్రభు దేవా వెనుదిరిగి చూసుకోలేదు.

అలా మొదలై

1995లో 'రాసాయియ్య'; 1996లో 'లవ్‌ బర్డ్స్‌', 'మిస్టర్‌ రోమియో'; 1997లో 'మినసారా కనవు', 'వీఐపీ'; 1998లో 'నామ్‌ ఇరువార్‌ నమ్మకు ఇరువా', 'లవ్‌ స్టోరీ-1999', 'కాతలా కాతల'; 1999లో 'నిన్నయ్‌ విరుక్కుమ్‌ వరాయి'...ఇలా చాలా చిత్రాలు చేశారు. ఇందులో తమిళ సినిమాలే అధికం.

తెలుగు సినిమాల్లోనూ

ప్రభు దేవా చేసిన సినిమాల్లో తెలుగులో 'సంతోషం', 'తొట్టి గాంగ్‌', 'కల్యాణ రాముడు', 'ఒక రాధ ఇద్దరు కృష్ణులు', 'తపన', 'ఇంట్లో శ్రీమతి వీధిలో కుమారి', 'అందరూ దొంగలే.. దొరికితే', 'స్టైల్​', 'చుక్కల్లో చంద్రుడు', 'నాయుడమ్మ', 'మైఖేల్‌ మదన కామరాజు' లాంటి చిత్రాలెన్నో ఉన్నాయి.

బహుముఖ ప్రజ్ఞాశాలి

ప్రభుదేవా 2005లో దర్శకుడిగా మారారు. తెలుగులో 'నువ్వొస్తానంటే నేనొద్దంటానా?'తో శుభారంభం చేశారు. ఈ చిత్రం భారీ విజయాన్ని సొంతం చేసుకుంది. విదేశాల నుంచి వచ్చిన ఓ యువకుడు ఇండియాలోని అమ్మాయితో ప్రేమలో పడి... ఆ ప్రేమను గెలిపించుకున్న విధానమే ఈ చిత్ర ఇతివృత్తం. 2006లో 'పౌర్ణమి', 2007లో తమిళంలో 'పోకిరి', 2007లో 'శంకర్‌ దాదా జిందాబాద్‌', 2009లో తమిళంలో 'విల్లు', హిందీలో 'వాంటెడ్', 2011లో తమిళంలో 'ఎంగియుమ్‌ కాదల్​', 'వేడి', 2012లో హిందీలో 'రౌడీ రాథోర్‌', 2013లో 'రామయ్య... వస్తావయ్యా', 'ఆర్​.రాజ్​ కుమార్‌' 2014లో 'ఆక్షన్‌ జాక్సన్​', 2015లో 'సింగ్‌ ఈజ్‌ బ్లింగ్‌' సినిమాలకు దర్శకత్వం వహించారు. నిర్మాతగా తమిళంలో నాలుగు సినిమాలు రూపొందించారు. 'సింగర్‌'గా తమిళంలో రెండు పాటలు పాడారు. గీత రచయితగా రెండు పాటలు రాశారు.

PRABHUDEVA BIRTHDAY SPECIAL STORY
నువ్వొస్తానంటే నేనొద్దంటానా

అవార్డులు - పురస్కారాలు

పాతిక సంవత్సరాలకు పైగా సాగిన సినీ యానంలో అనేక విజయాలు సాధించడమే కాకుండా అత్యంత ప్రతిష్ఠాత్మక పురస్కారాలు ఎన్నో అందుకున్నారు. 2019లో భారత ప్రభుత్వం ప్రభుదేవాను 'పద్మశ్రీ'తో సత్కరించింది. 1996లో తమిళ చిత్రం 'మినసారా కనవు'లో ఉత్తమ కొరియో గ్రాఫర్‌గా తొలిసారి జాతీయ పురస్కారం అందుకున్నారు. 2004లో హిందీ చిత్రం 'లక్ష్య'లో ఉత్తమ కొరియో గ్రాఫర్‌గా రెండోసారి జాతీయ అవార్డు వరించింది. ఫిలింఫేర్‌ పురస్కారం కూడా ఇదే విభాగంలో దక్కింది.

PRABHUDEVA BIRTHDAY SPECIAL STORY
రాష్ట్రపతి రామ్​నాథ్​ కోవింద్​ చేతుల మీదుగా 'పద్మశ్రీ' అవార్డు అందుకుంటూ...

2004లో తెలుగు చిత్రం 'వర్షం'లో ప్రభు దేవా సమకూర్చిన నృత్య భంగిమలకు గానూ ఉత్తమ కొరియోగ్రాఫర్‌గా నంది అవార్డును సొంతం చేసుకున్నారు. 2005లో 'నువ్వొస్తానంటే నేనొద్దంటానా?' చిత్రానికి గానూ ఉత్తమ కొరియో గ్రాఫర్‌గా ఫిలింఫేర్‌ సౌత్‌ పురస్కారాన్ని అందుకున్నారు. 2007లో తమిళ చిత్రం 'పోకిరి'కి గానూ అభిమాన దర్శకుడు కేటగిరిలో విజయ్‌ అవార్డును దక్కించుకున్నారు ప్రభు దేవా.

ఇదీ చదవండి: పవర్​స్టార్.. సూపర్​స్టార్ కాంబినేషన్​కు 12 ఏళ్లు

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.