డార్లింగ్ ప్రభాస్ ప్రధాన పాత్రలో 'కేజీఎఫ్' ఫేమ్ ప్రశాంత్‌నీల్ డైరెక్షన్‌లో తెరకెక్కనున్న యాక్షన్ ఎంటర్‌టైనర్ 'సలార్'. సంక్రాంతి వేడుకల్లో భాగంగా శుక్రవారం ఉదయం ఈ సినిమా పూజా కార్యక్రమాన్ని హైదరాబాద్‌లో నిర్వహించారు. ఈ కార్యక్రమానికి కన్నడ నటుడు యశ్ ముఖ్య అతిథిగా విచ్చేశారు. పూజా కార్యక్రమం అనంతరం ప్రభాస్-యశ్ ఫొటోలకు పోజులిచ్చారు. ప్రస్తుతం ఈ ఫొటోలు నెట్టింట్లో వైరల్‌గా మారాయి.

పవర్‌ఫుల్ యాక్షన్ చిత్రంగా తెరకెక్కనున్న 'సలార్'లో ప్రభాస్ విభిన్నమైన లుక్‌లో కనిపించనున్నారు. ఈ సినిమాలో పనిచేయనున్న ఇతర నటీనటుల వివరాలు తెలియాల్సి ఉంది. మరోవైపు ప్రభాస్ ప్రస్తుతం 'రాధేశ్యామ్' చిత్రీకరణలో బిజీగా పాల్గొంటున్నారు. అలాగే ప్రశాంత్ నీల్.. 'కేజీఎఫ్-2' నిర్మాణాంతర పనులు చూసుకుంటున్నారు.


ఇదీ చూడండి: '16 పేజీల డైలాగ్.. సింగిల్ టేక్‌లో చెప్పేసింది'