ETV Bharat / sitara

డార్లింగ్​ ఫ్యాన్స్ హంగామా.. ట్రెండింగ్​లో 'ప్రభాస్20' - ప్రభాస్ 20 అప్​డేట్స్

రెబల్​స్టార్ ప్రభాస్ హీరోగా రాధాకృష్ణ దర్శకత్వంలో ఓ సినిమా తెరకెక్కుతోంది. 'ప్రభాస్​20'గా రూపొందుతున్న ఈ చిత్రానికి ఇంకా టైటిల్ ఖరారు చేయలేదు. అయితే జూన్ రెండు లేదా మూడో వారంలో ఈ సినిమా ఫస్ట్​లుక్ వస్తుందని టాక్.

ప్రభాస్
ప్రభాస్
author img

By

Published : Jun 1, 2020, 8:11 PM IST

డార్లింగ్ ప్రభాస్.. ప్రస్తుతం ఓ పీరియాడికల్ సినిమాలో నటిస్తున్నాడు. పూజా హెగ్డే హీరోయిన్. రాధాకృష్ణ దర్శకుడు. ఇటీవలే జార్జియాలో ఓ షెడ్యూల్​ పూర్తి చేసుకుంది. అక్కడి నుంచి వచ్చిన తర్వాత చిత్రబృందమంతా హోం క్వారంటైన్​లో ఉంది. ప్రస్తుతం లాక్​డౌన్ కారణంగా షూటింగ్​లు ప్రారంభంకావడానికి ఇంకాస్త సమయం పట్టేలా ఉంది. ఈ సమయంలో ప్రభాస్​ తన అభిమానులకు ఓ సర్​ప్రైజ్ ఇచ్చేందుకు సిద్ధమవుతున్నట్లు సమాచారం.

ఈ సినిమా నుంచి ప్రభాస్ ఫస్ట్​లుక్​ను ఈనెల రెండు లేదా మూడో వారంలో విడుదల చేయనున్నట్లు తెలుస్తోంది. ఈ విషయం ప్రస్తుతం సామాజిక మాధ్యమాల్లో హాట్​ టాపిక్​గా​ మారింది. ఫ్యాన్స్ 'ప్రభాస్20' హ్యాష్​ట్యాగ్​తో ట్వీట్లు చేస్తూ తమ అభిమానాన్ని చాటుతున్నారు. దీంతో ఈ ట్యాగ్ ట్విట్టర్​లో నేషనల్​ వైడ్ టాప్​ ట్రెండింగ్​లో కొనసాగుతోంది.

ఈ సినిమా కోసం 'ఓ డియర్', 'రాధే శ్యామ్' అనే పేర్లను ఇప్పటికే రిజిస్టర్​ చేయించారు. కానీ వీటిలో ఏది ఇంకా ఖరారు చేయలేదు. యూవీ క్రియేషన్స్, గోపీకృష్ణ మూవీస్ సంయుక్తంగా ఈ సినిమాను నిర్మిస్తున్నాయి. వచ్చే ఏడాది వేసవికి ప్రేక్షకుల ముందుకు రానుంది.

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.