ETV Bharat / sitara

ప్రభాస్.. 'సలార్', 'ఆదిపురుష్' కోసం ఒకేసారి! - ప్రభాస్ సలార్ మూవీ

అగ్రకథానాయకుడు ప్రభాస్ ఏమాత్రం వెనక్కు తగ్గడం లేదు. ప్రస్తుతమున్న క్లిష్ట పరిస్థితుల్లోనూ పూర్తి జాగ్రత్తలు తీసుకుని, ఏకకాలంలో షూటింగ్​లకు హాజరయ్యేందుకు సిద్ధమవుతున్నారట.

PRABHAS movie news
ప్రభాస్
author img

By

Published : May 10, 2021, 5:31 AM IST

కరోనా ప్రభావంతో చాలావరకు సినిమా షూటింగ్​లు ఆగిపోయాయి. నటీనటులు కూడా దాదాపుగా ఇంటికే పరిమితమయ్యారు. కానీ డార్లింగ్ ప్రభాస్​ మాత్రం పలు జాగ్రత్తలతో చిత్రీకరణలో పాల్గొనున్నట్లు తెలుస్తోంది. ప్రస్తుతం హైదరాబాద్​లో ఉన్న ఆయన.. ఏక కాలంలో రెండు సినిమాల్లో నటించేందుకు సిద్ధమవుతున్నారట.

'కేజీఎఫ్' ఫేమ్ ప్రశాంత్ నీల్​ తెరకెక్కిస్తున్న 'సలార్' షూటింగ్ హైదరాబాద్​లోనే జరుగుతోంది. ముంబయిలో చిత్రీకరణలపై తాత్కాలిక నిషేధం విధించడం వల్ల 'ఆదిపురుష్' టీమ్​ కూడా ఇప్పుడు హైదరాబాద్​కే వచ్చేసింది. దీంతో ఏకకాలంలో రెండు షూటింగ్​ల్లో పాల్గొనేందుకు డార్లింగ్ హీరో రెడీ అవుతున్నారు.

ఇది చదవండి: 15 రకాల బిర్యానీలు ఒకేసారి తిన్నా: ప్రభాస్

ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.