ETV Bharat / sitara

Prabhas 25: మరో పాన్​ ఇండియా సినిమాలో ప్రభాస్​! - Prabhas 25th Movie Name

వరుస చిత్రాలతో బిజీగా ఉన్న రెబల్​స్టార్​ ప్రభాస్(Prabhas New Movie)​ నుంచి మరో కొత్త సినిమా ప్రకటన రానుంది. అక్టోబరు 7న ప్రభాస్​ నటించనున్న 25వ చిత్ర(Prabhas 25th Movie) వివరాలను ప్రకటించనున్నారు.

Prabhas to announce his 25th film on October 7
Prabhas 25: మరో పాన్​-ఇండియా సినిమాలో ప్రభాస్​!
author img

By

Published : Oct 4, 2021, 5:25 PM IST

'బాహుబలి' స్టార్​ ప్రభాస్​(Prabhas New Movie) ప్రస్తుతం వరుస చిత్రాలతో బిజీగా ఉన్నారు. ఆయన హీరోగా నటించిన 'రాధేశ్యామ్​' చిత్రం ఇప్పటికే షూటింగ్​ పూర్తి చేసుకొని సంక్రాంతికి విడుదలకు సిద్ధంగా ఉంది. దీంతో పాటు 'ఆదిపురుష్​', 'సలార్​' సినిమాతో పాటు నాగ్​ అశ్విన్​ దర్శకత్వంలో రూపొందనున్న మరో చిత్రంలోనూ నటిస్తున్నారు ప్రభాస్​. ప్రస్తుతం ఈయన నటిస్తున్న సినిమాలన్నీ పాన్​ ఇండియా స్థాయివి కావడం విశేషం. ఈ నేపథ్యంలో ప్రభాస్​ నుంచి మరో కొత్త సినిమా(Prabhas 25th Movie) కబురు రానుందని టాలీవుడ్​ వర్గాలు తెలిపాయి.

ప్రభాస్​ నటించినున్న 25వ చిత్ర వివరాలను(Prabhas 25th Movie Name) అక్టోబరు 7న ప్రకటించనున్నారు. ఈ ప్రాజెక్టుకు సంబంధించిన దర్శకుడు, నిర్మాణసంస్థ, నటీనటుల వివరాలను అదే రోజున వెల్లడిస్తారు. ఇది రెబల్​స్టార్ 25వ సినిమా కావడం వల్ల భారీ బడ్జెట్​తో ఈ మూవీని రూపొందించబోతున్నట్లు తెలుస్తోంది.

'బాహుబలి'తో హిట్​ కాంబినేషన్​గా నిలిచిన రాజమౌళితో ప్రభాస్​ తన 25వ చిత్రం కోసం పనిచేయనున్నారని సమాచారం. ఇప్పటికే రాజమౌళి తెరకెక్కిస్తోన్న 'ఆర్​ఆర్​ఆర్​'(RRR Shooting) కూడా పూర్తవ్వడం వల్ల వీరిద్దరి కాంబోలో మరో చిత్రం రూపొందనుందని ప్రచారం జరుగుతోంది. ఈ ఊహాగానాలపై స్పష్టత రావాలంటే అక్టోబరు 7 వరకు ఆగాల్సిందే!

ఇదీ చూడండి.. Drugs Case News: ఆర్యన్‌తో ఫోన్​లో మాట్లాడిన షారుక్

ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.