ETV Bharat / sitara

'బాహుబలి నా లైఫ్​లో ఓ మ్యాజిక్​.. లోపాలున్నా సాహోను ఆదరించారు' - RadheShyam release news

Prabhas chitchat: బాహుబలి సినిమా తన లైఫ్​లో జరిగిన మ్యాజిక్​ అన్నారు పాన్ ఇండియా స్టార్ ప్రభాస్. సాహో సినిమాలో తప్పులున్నప్పటికీ ప్రేక్షకులు ఆదరించారని చెప్పుకొచ్చారు. ఈనేల 11న విడుదల అవుతున్న రాధేశ్యామ్​ రిలీజ్​ ట్రైలర్​కు మంచి స్పందన లభించిన నేపథ్యంలో విలేకర్లతో ముచ్చటించి పలు విషయాలు షేర్ చేసుకున్నారు.

Prabhas chitchat
'బాహుబలి నా లైఫ్​లో ఓ మ్యాజిక్​.. లోపాలున్న సాహోను ఆదరించారు'
author img

By

Published : Mar 3, 2022, 4:02 PM IST

Prabhas Interview: 'సాహో'లో చిన్నచిన్న లోపాలున్నప్పటికీ ప్రపంచవ్యాప్తంగా ముఖ్యంగా ఉత్తరాది ప్రేక్షకులు ఆ చిత్రాన్ని బాగా ఆదరించారని నటుడు ప్రభాస్‌ అన్నారు. ఆయన లవర్‌బాయ్‌ రోల్‌లో నటించిన 'రాధేశ్యామ్‌' మార్చి 11న ప్రేక్షకుల ముందుకు రానుంది. ఈ నేపథ్యంలో బుధవారం 'రాధేశ్యామ్' ట్రైలర్‌ని విడుదల చేయగా మంచి స్పందన వచ్చింది. ఈ క్రమంలోనే 'రాధేశ్యామ్‌' టీమ్‌ కొంత సమయంపాటు బ్యాక్‌ టు బ్యాక్‌ ఇంటర్వ్యూల్లో పాల్గొంది. ఆ విశేషాలు మీకోసం..

RadheShyam movie news

ఓ సినిమా ఓకే చేసేటప్పుడు మీరు పరిగణనలోకి తీసుకునేది ఏమిటి? కథా లేదా హీరో పాత్ర?

ప్రభాస్‌: సినిమాని అంగీకరించే సమయంలో స్క్రిప్ట్‌ని ఎక్కువగా పరిగణనలోకి తీసుకుంటా. ఎందుకంటే అదే మన రాతను నిర్ణయిస్తుంది. హాలీవుడ్‌ వాళ్లు ఇన్ని విభిన్న చిత్రాలు ఎలా తెరకెక్కిస్తున్నారు? బ్లాక్‌బస్టర్స్‌ ఎలా సొంతం చేసుకుంటున్నారు? అనేది నాకు ఎప్పటికీ అర్థం కాదు. కొన్నిసార్లు నా పాత్రను కూడా పరిగణనలోకి తీసుకుంటాం.

సరైన స్క్రిప్ట్‌లు ఎంచుకునే క్రమంలో మీరు ఒత్తిడికిలోనయ్యారా?

ప్రభాస్‌: కథలను ఎంచుకునే సమయంలో నటీనటులు ఒత్తిడి లోనవుతారు. ‘బాహుబలి’కి ముందు ఒత్తిడికి గురయ్యేవాడిని. ఆ సినిమా తర్వాత కథలు ఎంచుకోవడం మరింత కష్టంగా మారింది. అప్పుడు కేవలం తెలుగు ప్రేక్షకుల్ని మాత్రమే దృష్టిలో ఉంచుకోవాలి. కానీ, ఇప్పుడు వివిధ ప్రాంతాలకు చెందిన ప్రేక్షకులను దృష్టిలో ఉంచుకోవాలి.

మీ దృష్టిలో ‘బాహుబలి’ అంటే ఏమిటి? ఆ చిత్రాన్ని మీరేలా చూస్తున్నారు?

ప్రభాస్‌: ‘బాహుబలి’ నాకెంతో ముఖ్యమైన సినిమా. ఆ సినిమా గొప్పతనాన్ని మాటల్లో వివరించలేను. నా జీవితంలో జరిగిన గొప్ప మ్యాజిక్‌ ఆ సినిమానే.

'బాహుబలి' తర్వాత మీరు చేసిన 'సాహో' సైతం బాక్సాఫీస్‌ వద్ద భారీగా వసూళ్లను రాబట్టింది. దానిపై మీ కామెంట్‌?

ప్రభాస్‌: 'బాహుబలి' క్రియేట్‌ చేసిన రికార్డ్స్‌ తర్వాత 'సాహో' కూడా కమర్షియల్‌గా మంచి విజయాన్ని అందుకుంది. అందుకు నేనెంతో ఆనందిస్తున్నా. ముఖ్యంగా ఉత్తరాదిలో 'సాహో'ని ప్రేక్షకులు ఆదరించారు. ఆ సినిమాలో చిన్న లోపాలున్నా.. దాన్ని ప్రేక్షకులు ఇష్టపడ్డారు. ప్రపంచంలో ఎక్కడా లేని విధంగా ఉత్తరాదిలో 'సాహో' ఆడింది. మా సినిమాని ప్రేక్షకులకు చేరువ చేసిన విలేకర్లందరికీ నా ధన్యవాదాలు.

పాన్‌ఇండియా సినిమా అనేసరికి వివిధ ప్రాంతాలకు చెందిన ప్రేక్షకులు వివిధ అంశాలను కోరుకుంటారు కదా?

ప్రభాస్‌: అది నిజమే. ముందు చెప్పినట్టుగా పాన్‌ ఇండియా చిత్రమంటేనే ఎంతో ఒత్తిడితో కూడుకున్నది. ప్రేక్షకులు ఎలాంటి ఎలివేషన్స్‌ కోరుకుంటారనే దానిపై ఎంతో ఆలోచించాం. ప్రేక్షకుల్ని అలరించేలా సినిమా తీయాలనే ఉద్దేశంతో దర్శకుడు రాధాకృష్ణను ఎంతో ఇబ్బందిపెట్టా.

ప్రేరణ పాత్ర చేయడం ఎలా అనిపించింది?

పూజాహెగ్డే: ప్రభాస్‌ సరసన ప్రేరణ పాత్రలో నటించడం నాకెంతో ఆనందంగా అనిపించింది. ప్రేరణ పాత్ర ఎలా ఉండాలనే విషయంలో దర్శకుడికి ఒక ఆలోచన ఉంది. దానికి అనుగుణంగా నేను ప్రేరణలా మారేందుకు ఎంతో వర్క్‌ చేశాను.

రాధాకృష్ణ: విక్రమాదిత్య, ప్రేరణ పాత్రల్లో ఒదిగిపోవాలంటే ముఖ్యంగా భావోద్వేగాలపై పట్టు ఉన్నవారై ఉండాలి. పాత్రల గురించి నటీనటులతో మాట్లాడుతున్న సమయంలో నాకు కూడా ఆ పాత్రలపై మరింత పట్టు వచ్చింది. విక్రమాదిత్య పాత్ర అయితే ఎంతో కష్టతరమైంది. ఎందుకంటే అలాంటి పాత్రను మనం నిజ జీవితంలో చూసి ఉండము.

ఈ సినిమా తెరకెక్కించడానికి ఎంతకాలం పట్టింది?

రాధాకృష్ణ: దాదాపు ఐదేళ్ల నుంచి మేమంతా కలిసి ఈ సినిమా కోసం పని చేస్తున్నాం. మాకు సాధ్యమైనంత వరకూ ఈ చిత్రాన్ని మరింత గ్రాండ్‌గా ప్రేక్షకులకు చూపించాలనే మొదటి నుంచి ప్రభాస్‌, నేనూ అనుకుంటున్నాం.

విదేశాల్లోనూ మీకు అభిమానులున్నారు కదా దానిపై మీ అభిప్రాయం?

ప్రభాస్‌: ఆనందంగా ఉంది

పూజాహెగ్డే: విదేశాల్లోనూ అభిమానులు కలిగి ఉన్నందుకు నాకెంతో సంతోషంగా ఉంది. ఇటీవల నేను లండన్‌ వెళ్లినప్పుడు అక్కడ ఓ ప్రముఖ నగరంలో రోడ్డుపై వెళ్తుంటే కొంతమంది నన్ను గుర్తుపట్టి.. ‘పూజా పూజా’ అని కేకలు వేశారు. వాళ్లు నన్ను ఎలా గుర్తుపట్టారా? అని నేను షాకయ్యా. ఆ తర్వాత వాళ్లు నా వద్దకు వచ్చి.. ‘‘మీరు చేసిన సినిమాలు చేశాం. మీరు బాగా నటిస్తున్నారు’’ అని చెప్పడంతో నాకు ఆనందంగా అనిపించింది. విదేశాల్లో ఉండే మా కజిన్‌కు సైతం ఇలాంటి అనుభవమే ఎదురైంది. ఇటీవల ఆమె ఓ పని నిమిత్తం ఓ కొత్త ప్రాంతానికి వెళ్లగా.. అక్కడ వాళ్లందరూ గుర్తుపట్టి.. ‘‘మీరు పూజాహెగ్డే వాళ్ల సోదరి కదా. ఆమె ఇన్‌స్టాలో మీ ఫొటోలు చూశాం’’ అని అడిగారట. ఆమె వెంటనే నాకు ఫోన్‌ చేసి చెప్పింది.

సల్మాన్‌ఖాన్‌, షారుఖ్‌ ఖాన్‌లతో ఎప్పుడు వర్క్‌ చేస్తారు? చిత్రపరిశ్రమలో ఉన్న హద్దుల్ని చెరిపేసింది మీరే?

ప్రభాస్‌: చిత్రపరిశ్రమకు సంబంధించిన భాషాపరమైన హద్దుల్ని చెరిపేసింది రాజమౌళి. ఆయన తెరకెక్కించిన ‘బాహుబలి’లో భాగం అయ్యానంతే. ఇక సల్మాన్‌, షారుఖ్‌లతో కలిసి ఎప్పుడు నటిస్తానో నాక్కూడా తెలియదు.

అమితాబ్‌తో కలిసి వర్క్‌ చేయడం ఎలా ఉంది?

ప్రభాస్‌: ఆయన గురించి నేను గంటల కొద్దీ మాట్లాడాలనుకోవడం లేదు. కేవలం ఒకే ఒక్క మాట చెబుతున్నా.. ఆయన ఒక అద్భుతమైన మనిషి. ఆయనతో కలిసి వర్క్‌ చేయాలన్న కల నెరవేరుతోంది.

అమితాబ్‌ నటించిన సినిమాల్లో మీకు బాగా నచ్చిన చిత్రమేది?

ప్రభాస్‌: షోలే.. ఇది ఒక్కటి మాత్రమే కాదు ఆయన నటించిన చాలా సినిమాలు నాకు నచ్చాయి. ఏ జోనర్‌ సినిమా అయినా ఆయన నటన బాగుంటుంది.

ఈ సినిమాలో మీరు హస్తసాముద్రిక నిపుణుడిగా కనిపించారు. నిజజీవితంలో మీరు జాతకాలు నమ్ముతారా?

ప్రభాస్‌: జాతకాలు, జ్యోతిష్యం.. నేను అంతగా పట్టించుకోలేదు. రాధాకృష్ణ నాకు ఈ కథ చెప్పాక.. చాలామంది తమ నిజజీవితాల్లో ఎదుర్కొన్న ఘటనలు చెప్పారు. అవన్నీ విని నేను షాకయ్యా. వ్యక్తిగతంగా ఇప్పటి వరకూ ఎవరికీ నా చేయి చూపించి జాతకం చెప్పించుకోలేదు.

జ్యోతిష్యాన్ని మీరు నమ్ముతారా?

రాధాకృష్ణ: నేను ఎంతో మంది జ్యోతిష్యుల్ని, హస్త సాముద్రిక నిపుణుల్ని కలిశాను. కానీ, జాతకాలను నమ్ముతానా? లేదా? అనేది ఎప్పటికీ సమాధానం చెప్పలేని ప్రశ్నే.

మీ తోటి బృందానికి మీరు ఎక్కువగా మీల్స్‌ పంపిస్తుంటారు కదా?

ప్రభాస్‌: అవును. నాతోపాటు పనిచేసే కోస్టార్స్‌కి భోజనం పంపిస్తుంటాను. అందులో వెజ్‌, నాన్‌ వెజ్‌ అన్నీ ఉంటాయి. ఎందుకంటే వాళ్లు ఎలాంటి ఆహారాన్ని ఇష్టపడతారనేది నాకు తెలియదు.

ఇదీ చదవండి: KGF 2: 'కేజీఎఫ్​ 2' ట్రైలర్​కు టైమ్​ ఫిక్స్​

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.