ETV Bharat / sitara

మరో పాన్​ ఇండియా ప్రాజెక్టులో ప్రభాస్​.. ప్రకటన అప్పుడే! - పాన్​ ఇండియా ప్రాజెక్ట్​లో ప్రభాస్

Prabhas Siddharth Anand Movie: స్టార్​ హీరో ప్రభాస్​ మరో పాన్​ ఇండియా సినిమాను ఓకే చేశారని తెలిసింది. 2022 జనవరి 1న ఈ చిత్ర విశేషల గురించి అధికారికంగా ప్రకటించనున్నారట!

prabhas
ప్రభాస్​
author img

By

Published : Dec 13, 2021, 8:31 AM IST

Prabhas Siddharth Anand Movie: స్టార్​ హీరో ప్రభాస్​ అభిమానుల్లో జోష్​ నింపే వార్త మరొకటి బయటకు వచ్చింది. వరుస పాన్​ ఇండియా సినిమాలతో బిజీగా ఉన్న ఆయన.. తన జోరును మరింత పెంచేందుకు సిద్ధమయ్యారని తెలిసింది. మైత్రీ మూవీ మేకర్స్​ బ్యానర్​లో ఓ పాన్​ ఇండియా మూవీ చేయబోతున్నట్లు సమాచారం. ఇప్పటికే చర్చలు కూడా పూర్తయ్యాయట! 2022 జనవరి 1 ఈ ప్రాజెక్టును అధికారికంగా ప్రకటించనున్నారని వినికిడి. ఒకవేళ ఇదే కనుక నిజమైతే ఫ్యాన్స్​కు పండగే.

ఈ చిత్రాన్ని బాలీవుడ్​ దర్శకుడు సిద్ధార్థ్​ ఆనంద్​ తెరకెక్కించనున్నారని అంతా మాట్లాడుకుంటున్నారు. అంతకుముందు కూడా ఈ డైరెక్టర్​తో డార్లింగ్​ మూవీ చేయబోతున్నారని ప్రచారం సాగింది. కానీ ఆ తర్వాత ఎవరూ దీని గురించి మాట్లాడుకోలేదు. చాలా కాలం తర్వాత మళ్లీ ఈ ప్రచారం తెరపైకి వచ్చింది. కాగా, సిద్ధార్థ్​ ఆనంద్​.. తన చివరి రెండు సినిమాలు 'బ్యాంగ్ బ్యాంగ్​​', 'వార్'ను​ హృతిక్​ రోషన్​తో కలిసి చేశారు. ఇవి సూపర్​ హిట్​ అయ్యాయి.

ప్రభాస్​ ఇప్పటికే బీటౌన్​ దర్శకుడు ఓం రౌత్​తో 'ఆదిపురుష్' చేస్తున్నారు. దీంతో పాటే 'సలార్'​, 'ప్రాజెక్ట్​ కె', 'స్పిరిట్'​ చిత్రాల్లోనూ నటిస్తున్నారు. ఇక రాధాకృష్ణ దర్శకత్వంలో ఆయన నటించిన 'రాధేశ్యామ్'తో జనవరి 14న ప్రేక్షకుల ముందుకు రానుంది. ఇందులో పూజాహెగ్డే హీరోయిన్​. దీనిపై అభిమానుల్లో భారీ అంచనాలు నెలకొన్నాయి.

  • " class="align-text-top noRightClick twitterSection" data="">

ఇదీ చూడండి: 'రాధేశ్యామ్' సినిమా 'గీతాంజలి' మ్యాజిక్​ను రిపీట్​ చేస్తుందా?

ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.