ETV Bharat / sitara

ప్రభాస్‌ చేతుల మీదగా 'కళాకార్‌'.. సందీప్​ కిషన్​ కొత్త సినిమా - మలయాళ అంధాదున్​

కొత్త సినిమా అప్డేట్స్​ వచ్చాయి. ఇందులో హీరోలు సందీప్​ కిషన్​, సుమంత్, పృథ్వీ రాజ్, శ్రీకాంత్ నటించిన​​ చిత్రాల వివరాలు ఉన్నాయి.​ దీంతో పాటే ఇంకా పలు సినిమా విశేషాలు ఉన్నాయి. అవన్నీ మీకోసం..

cinema updates
సినిమా అప్డేట్స్​
author img

By

Published : Sep 19, 2021, 3:25 PM IST

యథార్థ సంఘటనల ఆధారంగా తెరకెక్కిన చిత్రం 'కళాకార్‌'(Kalakar movie cast). గతంలో 'జానకీ వెడ్స్‌ శ్రీరామ్‌', '6టీన్స్‌' చిత్రాలతో అలరించిన రోహిత్‌ హీరోగా ఈ సినిమా రూపుదిద్దుకుంది. శ్రీను బండెలా దర్శకత్వం వహించిన ఈసినిమాకు వెంకట్‌ రెడ్డి జయపురం నిర్మాతగా వ్యవహరించారు. సస్పెన్స్ క్రైమ్‌ థ్రిల్లర్‌గా తెరకెక్కిన ఈ సినిమా టీజర్‌ను ఆదివారం ఉదయం హీరో ప్రభాస్‌(prabhas movies) విడుదల చేశారు. టీజర్‌ ఆసక్తికరంగా ఉందని.. ప్రతి సన్నివేశం ఉత్కంఠ రేకెత్తించేలా సాగిందని ఆయన తెలిపారు. ఈ సినిమా మంచి విజయాన్ని అందుకోవాలని ఆకాంక్షించారు.

  • " class="align-text-top noRightClick twitterSection" data="">
cinema updates
ప్రభాస్​ చేతులు మీదగా 'కళాకర్'​ టీజర్​
cinema updates
ప్రభాస్​ చేతులు మీదగా 'కళాకర్'​ టీజర్​

సందీప్​ కిషన్​ కొత్త సినిమా

'గల్లీరౌడీ'తో(gully rowdy movie review) పాజిటివ్​ టాక్‌ సొంతం చేసుకుని జోష్‌లో ఉన్న హీరో సందీప్​ కిషన్(sundeep kishan new movie)​ తన కొత్త ప్రాజెక్ట్​ను పట్టాలెక్కించారు. ఆయన హీరోగా వీఐ ఆనంద్‌ దర్శకత్వంలో ఓ చిత్రం రూపుదిద్దుకోనుంది. ఆదివారం(సెప్టెంబరు 19) ఉదయం ఈ సినిమా పూజా కార్యక్రమం హైదరాబాద్‌లో వేడుకగా జరిగింది. హీరోలు నాగశౌర్య, అల్లరి నరేశ్‌ ముఖ్య అతిథులుగా విచ్చేసి చిత్రబృందానికి అభినందనలు తెలిపారు. ముహూర్తపు షాట్‌ చిత్రీకరణలో హీరో హీరోయిన్లపై నరేశ్‌ క్లాప్‌ కొట్టగా.. నాగశౌర్య కెమెరా స్విచ్ఛాన్‌ చేశారు. సస్పెన్స్ థ్రిల్లర్‌గా ఈ సినిమా తెరకెక్కుతున్నట్లు సమాచారం. కావ్య థాపర్‌ కథానాయిక. హాస్య మూవీస్‌ పతాకంపై రాజేశ్‌ దండా ఈ చిత్రాన్ని నిర్మిస్తున్నారు. 'టైగర్‌' తర్వాత ఆనంద్‌-సందీప్‌ కాంబినేషన్‌లో వస్తోన్న రెండో సినిమా ఇది.

cinema updates
సందీప్​ కిషన్​ కొత్త సినిమా షూటింగ్​ షురూ

మళ్ళీ మొదలైంది

సుమంత్‌ కథానాయకుడిగా నటిస్తున్న విభిన్న కుటుంబ కథా చిత్రం 'మళ్ళీ మొదలైంది'(malli modalaindi sumanth). తాజాగా ఈ చిత్రానికి సంబంధించిన 'అలోన్​ అలోన్'​ అనే మెలోడీ సాంగ్ విడుదలై ఆకట్టుకుంటోంది. సిద్​​ శ్రీరామ్ ఈ గీతాన్ని ఆలపించగా.. అనూప్​ రూబెన్స్​ మ్యూజిక్​ అందించారు. నైనా గంగూలీ కథానాయిక. కీర్తి కుమార్‌ దర్శకత్వం వహించిన ఈ సినిమా షూటింగ్‌ శరవేగంగా జరుగుతోంది. రెడ్‌ సినిమాస్‌ బ్యానర్‌పై తెరకెక్కుతోన్న ఈ చిత్రానికి రాజశేఖర్‌ నిర్మాత. సుహాసిని, పోసాని కృష్ణమురళీ, మంజుల ఘట్టమనేని కీలకపాత్రలు పోషిస్తున్నారు.

మలయాళ 'అంధాదున్​'

హీరో పృథ్వీ రాజ్​ నటించిన కొత్త సినిమా అంధాదున్ మలయాళ​ రీమేక్​ 'బ్రమమ్​'(andhadhun malayalam remake). ఈ చిత్రాన్ని అమెజాన్​ ప్రైమ్​లో అక్టోబర్​ 7నుంచి స్ట్రీమింగ్​ కానున్నట్లు తెలిపింది చిత్రబృందం. రవి కె చంద్రన్​ దర్శకుడు.

cinema updates
'అంధాదున్'​ మలయాళ రీమేక్​

టీజర్​ టైమ్​ ఫిక్స్​ 'రౌడీ బాయ్స్​'

ప్రముఖ నిర్మాత దిల్‌రాజు సోదరుడైన శిరీష్‌ తనయుడు ఆశీష్‌ హీరోగా పరిచయం అవుతున్న సినిమా 'రౌడీబాయ్స్'(rowdy boys movie)​. 'హుషారు' దర్శకుడు శ్రీ హర్ష కొనెగంటి ఈ సినిమాను తెరకెక్కిస్తున్నారు. ఈ చిత్ర టీజర్​ను సెప్టెంబరు 20న రాత్రి 7గంటలకు రిలీజ్​ చేయనున్నట్లు తెలిపింది చిత్రబృందం. అనుపమ పరమేశ్వరన్​ కథానాయిక. దేవీశ్రీ ప్రసాద్​ స్వరాలు సమకూరుస్తున్నారు.

cinema updates
రౌడీ బాయ్స్​

'ఇది మా కథ' టీజర్​

శ్రీకాంత్​, భూమిక, సుమంత్​, తన్య నటించిన కొత్త సినిమా 'ఇది మా కథ'(idi maa prema katha movie). ఆదివారం(సెప్టెంబరు 19) ఈ చిత్ర టీజర్​ విడుదలై ఆకట్టుకుంటోంది.

ఇదీ చూడండి: ఒకే స్టేజ్‌పై మహేశ్‌- ఎన్టీఆర్‌.. ఎప్పుడంటే?

ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.