'బాహుబలి' సిరీస్ తర్వాత డార్లింగ్ ప్రభాస్ క్రేజ్ అమాంతం పెరిగిపోయింది. అంతర్జాతీయ స్థాయిలో గుర్తింపు వచ్చింది. ఈ విషయం దృష్టిలో పెట్టుకొనే బాలీవుడ్ ప్రముఖ దర్శకుడు సంజయ్ లీలా భన్సాలీ.. ప్రభాస్‌కు అదిరిపోయే ఆఫర్ ఇచ్చాడు. అయితే డార్లింగ్.. ఆ అవకాశాన్ని సున్నితంగా తిరస్కరించాడట.
అసలు విషయమిదే
బాలీవుడ్ ప్రముఖ దర్శకుల్లో సంజయ్ లీలా భన్సాలీ ఒకరు. అతడి దర్శకత్వంలో నటించాలని అగ్రహీరోలు ఆసక్తి చూపిస్తుంటారు. అలాంటిది ఈ డైరక్టర్.. తాను తీసే 'పద్మావత్'లో రాజా రావల్ రతన్ సింగ్ పాత్ర కోసం టాలీవుడ్ హీరో ప్రభాస్‌కు పిలిచి మరీ అవకాశమిచ్చాడు. కానీ ఈ కథానాయకుడు సున్నితంగా తిరస్కరించాడు.
'బాహుబలి'తో వచ్చిన గుర్తింపు కారణంగానే ప్రభాస్ ఇలా చేశాడట. ఆ తర్వాత ఆ పాత్రలో షాహిద్ కపూర్ నటించి, విమర్శకుల ప్రశంసలు అందుకున్నాడు. రణ్‌వీర్ సింగ్, దీపికా పదుకొణె ప్రధాన పాత్రలు పోషించారు. విమర్శలు ఎదుర్కొన్నప్పటికీ బాక్సాఫీసు వద్ద మంచి వసూళ్లు రాబట్టిందీ చిత్రం.