Prabhas Radheshyam: పాన్ఇండియా స్థాయిలో సినిమా తెరకెక్కించడానికి 15-20 ఏళ్లుగా ప్రయత్నాలు జరుగుతున్నా.. అది ప్రభాస్‌తోనే సాధ్యపడిందని అన్నారు సీనియర్ నటుడు, రెబల్‌స్టార్ కృష్ణంరాజు. త్వరలోనే ప్రభాస్‌తో పాన్‌వరల్డ్ కూడా సాధ్యపడుతుందని చెప్పారు. డార్లింగ్ నటించిన 'రాధేశ్యామ్' ఇటీవలే విడుదలై మంచి టాక్‌తో దూసుకుపోతోంది. ఈ సినిమాలో పరమహంస పాత్రలో మెరిశారు కృష్ణంరాజు. ఈ క్రమంలోనే ఓ ప్రత్యేక ఇంటర్వ్యూలో ప్రభాస్ వ్యక్తిత్వం గురించి చెప్పారు.
"ప్రభాస్ది నా లాంటి వ్యక్తిత్వమే. ఎందుకంటే ప్రభాస్‌కు నలుగురికి భోజనం పెట్టాలని, అది చూసి తృప్తి పడాలని ఉంటుంది. మనిషి లేనప్పుడు ఆ మనిషి గురించి చెడ్డగా మాట్లాడకూడదని, ఎవరి గురించైనా మంచిగానే మాట్లాడాలని మా ఇద్దరికీ ఉంటుంది. ఇండస్ట్రీలోనూ అతనంటే బాగా ఇష్టం."
-కృష్ణంరాజు, సీనియర్ నటుడు
ఏడాదికి ప్రభాస్ రెండు సినిమాలు..
వచ్చే ఏడాది నుంచి ప్రభాస్ సంవత్సరానికి రెండు సినిమాలు చేస్తారని కృష్ణంరాజు వెల్లడించారు. అలాగే 'రాధేశ్యామ్' చిత్రాన్ని 'బాహుబలి'తో పోల్చి చూడవద్దని కోరారు. తాను చేసిన 'మనవూరి పాండవులు' లాంటి చిత్రాన్ని ప్రభాస్ చేస్తే చూడాలని ఉందని ఆకాంక్షించారు.
మార్చి 11న విడుదలైన ఈ చిత్రం తొలిరోజే రూ.79 కోట్ల గ్రాస్ వసూళ్లు సాధించింది. రాధాకృష్ణ దర్శకత్వం వహించిన ఈ చిత్రంలో విక్రమాదిత్య అనే హస్తసాముద్రికా నిపుణుడిగా నటించారు ప్రభాస్. దాదాపు రూ.300 కోట్ల బడ్జెట్‌తో యు.వి.క్రియేషన్స్ ఈ సినిమాను నిర్మించింది. రాజమౌళి ఈ సినిమాకు వాయిస్ ఓవర్ ఇచ్చారు. జస్టిన్ ప్రభాకరన్ పాటలు స్వరపరచగా, తమన్ బ్యాక్‌గ్రౌండ్ మ్యూజిక్ అందించారు.
ఇదీ చూడండి: Radheshyam review: ప్రేమకు, విధికి మధ్య జరిగిన యుద్ధంలో గెలుపెవరిది?