దాదాపు పదేళ్ల తర్వాత పూర్తిస్థాయి లవర్‌బాయ్‌గా ప్రభాస్ నటిస్తున్న చిత్రం 'రాధేశ్యామ్'. రాధాకృష్ణ కుమార్ దర్శకత్వం వహిస్తున్నారు. ఈ ప్రేమకథా సినిమాలో పూజాహెగ్డే హీరోయిన్. ఈ సినిమా టీజర్ కోసం అభిమానులందరూ ఎంతో ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు. దీంతో ప్రేమికుల దినోత్సవం సందర్భంగా ఫిబ్రవరి 14 ఉదయం 9:18 గంటలకు 'రాధేశ్యామ్' గ్లింప్స్ విడుదల చేస్తున్నట్లు ప్రకటించారు.
70ల నాటి ప్రేమకథతో ఈ సినిమాను తెరకెక్కిస్తున్నారు. పాన్ ఇండియా స్థాయిలో విడుదలయ్యే ఈ చిత్రానికి దక్షిణాదిలోని అన్ని భాషల్లో జస్టిన్ ప్రభాకరన్, హిందీ వెర్షన్‌కు మిథున్, మనన్ భరద్వాజ్ ద్వయం సంగీతం అందించనున్నారు. గోపీకృష్ణ మూవీస్, యూవీ క్రియేషన్స్ సంయుక్తంగా నిర్మిస్తున్నాయి.
ఇది చదవండి: ప్రభాస్ 'రాధేశ్యామ్' విడుదల ఎప్పుడంటే?