Radhe shyam movie: ప్రభాస్ 'రాధేశ్యామ్' మార్చి 11న ప్రేక్షకుల ముందుకు రానుంది. త్వరలో ప్రమోషన్స్ కూడా మరోసారి మొదలుపెట్టనున్నట్లు తెలుస్తోంది. దేశవ్యాప్తంగా పర్యటించనున్న చిత్రబృందం సినిమాపై హైప్ తీసుకురానుంది. ఈ క్రమంలోనే చిత్ర నిడివి గురించి ఆసక్తికర విషయం బయటకొచ్చింది.
వింటేజ్ ప్రేమకథతో తెరకెక్కిన 'రాధేశ్యామ్' నిడివి.. 2 గంటల 20 నిమిషాలు అని తెలుస్తోంది. ఈ సినిమాలో ప్రభాస్ సరసన పూజాహెగ్డే హీరోయిన్గా ,నటించింది. కృష్ణంరాజు కీలకపాత్ర పోషించారు. జస్టిన్ ప్రభాకరన్ పాటలు స్వరపరచగా, తమన్ బ్యాక్గ్రౌండ్ మ్యూజిక్ అందించారు. రాధాకృష్ణ కుమార్ దర్శకత్వం వహించారు. యూవీ క్రియేషన్స్-గోపీకృష్ణ మూవీస్ సంయుక్తంగా నిర్మించాయి.
- " class="align-text-top noRightClick twitterSection" data="">
Ghani release date: డిసెంబరులో రిలీజ్ కావాల్సిన వరుణ్ తేజ్ 'గని'.. వరుసగా వాయిదా పడుతూ వస్తోంది. డిసెంబరు 2, డిసెంబరు 24, సంక్రాంతికి రిలీజ్, ఫిబ్రవరి 25.. ఇలా పలు తేదీలు అనుకున్నప్పటికీ, ఆయా తేదీల్లో ఇతర సినిమాలు రిలీజ్కు సిద్ధమవడం వల్ల 'గని' వాయిదా పడుతూ వచ్చింది. ఇప్పుడు ఎట్టకేలకు కొత్త విడుదల తేదీని ఫిక్స్ చేసినట్లు తెలుస్తోంది. ఏప్రిల్ 7న సినిమాను థియేటర్లలోకి తీసుకురావాలని చిత్రబృందం భావిస్తుందట.
బాక్సింగ్ నేపథ్య కథతో తెరకెక్కిన ఈ సినిమాలో వరుణ్ తేజ్ సరసన సయీ మంజ్రేకర్ హీరోయిన్గా చేసింది. కిరణ్ కొర్రపాటి దర్శకత్వం వహించారు. తమన్ సంగీత దర్శకుడు. అల్లు బాబీ-సిద్ధు సంయుక్తంగా నిర్మించారు.
Raviteja Dhamaka: ఇటీవల 'ఖిలాడి'గా థియేటర్లలోకి వచ్చిన రవితేజ.. ప్రస్తుతం 'ధమాకా' షూటింగ్లో బిజీగా ఉన్నారు. ఫైట్ మాస్టర్స్ హైదరాబాద్లో పోరాట సన్నివేశాలు చిత్రీకరిస్తున్నారు. ఇందుకు సంబంధించిన ఓ ఫొటోను సోషల్ మీడియాలో పోస్ట్ చేశారు.
రవితేజ ద్విపాత్రాభినయం చేస్తున్న ఈ సినిమాలో శ్రీలీల ఓ హీరోయిన్గా చేస్తోంది. త్రినాధ్ రావు నక్కిన దర్శకత్వం వహిస్తున్నారు.
ఇవీ చదవండి: