ETV Bharat / sitara

'రాధేశ్యామ్' శాటిలైట్ హక్కులు రూ.250 కోట్లకు? - రాధేశ్యామ్ రిలీజ్ డేట్

Prabhas radhe shyam: ప్రభాస్ 'రాధేశ్యామ్' సినిమా శాటిలైట్​ హక్కులు భారీ ధరకు అమ్ముడుపోయినట్లు తెలుస్తోంది. రూ.250 కోట్లకు ఈ డీల్ కుదిరినట్లు సమాచారం.

radhe shyam movie
రాధేశ్యామ్ మూవీ
author img

By

Published : Feb 5, 2022, 9:47 PM IST

Radhe shyam Satilite rights: యంగ్‌ రెబల్‌ స్టార్‌ ప్రభాస్‌ నటించిన పీరియాడికల్‌ ప్రేమకథా చిత్రం 'రాధేశ్యామ్‌'. రాధాకృష్ణ కుమార్‌ దర్శకత్వంలో తెరకెక్కిన ఈ చిత్రం సంక్రాంతి కానుకగా విడుదల కావాల్సి ఉండగా కరోనా కారణంగా వాయిదా పడింది. ఎట్టకేలకు ప్రపంచ వ్యాప్తంగా మార్చి11న థియేటర్లో విడుదల చేయనున్నట్లు ఇటీవలే చిత్రబృందం ప్రకటించింది.

అయితే 'రాధేశ్యామ్‌' ఓటీటీ విడుదలకు సంబంధించి ఓ వార్త నెట్టింట చక్కర్లు కొడుతోంది. ఈ సినిమా డిజిటల్‌ శాటిలైట్‌ హక్కుల కోసం రూ.250 కోట్లకు డీల్‌ కుదిరినట్లు సమాచారం. దీనిపై అధికారిక ప్రకటన కూడా రావాల్సి ఉంది. ఈ చిత్రానికి రూ.350 కోట్లు ఖర్చు కాగా .. ఇప్పటికే నిర్మాతలకు 70శాతం రిటర్న్స్‌ వచ్చాయట.

1970ల కాలం నాటి ప్రేమకథతో రూపొందుతున్న చిత్రంలో ప్రభాస్ విక్రమాదిత్య అనే హస్తసాముద్రికా నిపుణుడిగా కనిపించనున్నారు. ఆయన ప్రేయసి ప్రేరణగా పూజాహెగ్డే నటిస్తోంది. ఈ సినిమాను గోపీకృష్ణ మూవీస్‌, యూవీ క్రియేషన్స్‌ సంస్థలు సంయుక్తంగా నిర్మిస్తున్నాయి.

  • " class="align-text-top noRightClick twitterSection" data="">

ఇవీ చదవండి:

ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.