ప్రభాస్ కెమెరా ముందుకెళ్లి చాలా రోజులైంది. ఆయన 'సాహో' విడుదల తర్వాత, ఎక్కువగా ఆ సినిమా హడావుడిలోనే గడిపాడు. ఆ తర్వాత విరామం తీసుకున్నాడు. ఇక నుంచి మళ్లీ చిత్రీకరణతో బిజీ కాబోతున్నాడు. రాధాకృష్ణ కుమార్ దర్శకత్వం వహిస్తున్న కొత్త చిత్రం కోసం వచ్చే వారం నుంచే ప్రభాస్ రంగంలోకి దిగబోతున్నాడు.
ఇప్పటికే అందుకోసం అన్ని ఏర్పాట్లూ పూర్తయ్యాయి. ప్రొడక్షన్ డిజైనర్ ఎస్.రవీందర్ నేతృత్వంలో హైదరాబాద్‌లో పలు సెట్లు తీర్చిదిద్దారు. ఆ నేపథ్యంలోనే సినిమా చిత్రీకరణ జరగబోతోందని సినీ వర్గాలు తెలిపాయి. ఓ ప్రేమకథతో ఈ చిత్రం తెరకెక్కనుందని సమాచారం. 'జాన్' అనే పేరు కూడా ప్రచారంలోకి వచ్చింది. ఇందులో ప్రభాస్ సరసన పూజాహెగ్డే నటిస్తున్న సంగతి తెలిసిందే.
ఇదీ చదవండి: అమ్మను ఏడాది పాటు చూడకుండా ఉన్నా: రష్మి