ప్రభాస్-నాగ్ అశ్విన్ కాంబోలో రానున్న సినిమాకి సంబంధించి.. ప్రి విజువలైజేషన్ పనులు శరవేగంగా జరుగుతున్నాయి. విజువల్ ఎఫెక్ట్స్‌కి ప్రాధాన్యమున్న సినిమా కావడం వల్ల అందుకు సంబంధించిన పనుల్ని ఓ కొలిక్కి తీసుకొచ్చే ప్రయత్నంలో.. నాగ్ అశ్విన్, ఆయన బృందం బిజీ బిజీగా ఉన్నారు.
అయితే జులై 19 (ఆదివారం) ఈ సినిమాకి సంబంధించిన ఓ కొత్త విషయాన్ని చెప్పనున్నట్లు చిత్ర నిర్మాణ సంస్థ వైజయంతి మూవీస్ సామాజిక మాధ్యమాల్లో ఓ పోస్టు పెట్టింది. దీనిపై సినీప్రేక్షకుల్లో ఆసక్తి నెలకొంది. దీంతో పాటు కథానాయిక ఎంపికపై దృష్టి పెట్టారు నాగ్ అశ్విన్. ఓ బాలీవుడ్ నాయిక ఈ సినిమాలో మెరవబోతున్నట్టు టాక్.
-
We’re extremely thrilled with the response guys!
— Vyjayanthi Movies (@VyjayanthiFilms) July 18, 2020 " class="align-text-top noRightClick twitterSection" data="
We love you 💙
Surprise unveils at 11 AM tomorrow.
Stay Tuned: https://t.co/AEDNZ358RI#Prabhas @nagashwin7 @VyjayanthiFilms #Prabhas21 pic.twitter.com/4ImYR3qHxM
">We’re extremely thrilled with the response guys!
— Vyjayanthi Movies (@VyjayanthiFilms) July 18, 2020
We love you 💙
Surprise unveils at 11 AM tomorrow.
Stay Tuned: https://t.co/AEDNZ358RI#Prabhas @nagashwin7 @VyjayanthiFilms #Prabhas21 pic.twitter.com/4ImYR3qHxMWe’re extremely thrilled with the response guys!
— Vyjayanthi Movies (@VyjayanthiFilms) July 18, 2020
We love you 💙
Surprise unveils at 11 AM tomorrow.
Stay Tuned: https://t.co/AEDNZ358RI#Prabhas @nagashwin7 @VyjayanthiFilms #Prabhas21 pic.twitter.com/4ImYR3qHxM
సి.అశ్వనీదత్ నిర్మిస్తున్న ఈ సినిమా పాన్ ఇండియా స్థాయిలో తెరకెక్కనుంది. యాక్షన్ ఘట్టాలతో ఈ చిత్రాన్ని ఆరంభిస్తారని సమాచారం.
ప్రస్తుతం 'రాధే శ్యామ్'తో నటిస్తున్నాడు ప్రభాస్. ఇటీవల ఈ చిత్రానికి సంబంధించి విడుదలైన ఫస్ట్‌లుక్ అభిమానులను విపరీతంగా ఆకట్టుకుంది.
ఇది చూడండి : ప్రేక్షకులు ఇది విన్నారా.. ట్రైలర్ చూడాలంటే 25 రూపాయలట!