యంగ్ రెబల్‌స్టార్ ప్రభాస్ అభిమానులకు దర్శకుడు నాగ్ అశ్విన్ స్పెషల్ సర్‌ప్రైజ్ ఇచ్చాడు. త్వరలో ప్రభాస్ హీరోగా తాను తెరకెక్కించనున్న చిత్రానికి సంబంధించి ఓ అప్‌డేట్‌ను ఇస్తానని డేట్స్‌తో సహా ప్రకటించాడు.
వైజయంతి మూవీస్ బ్యానర్‌పై నాగ్‌అశ్విన్-ప్రభాస్ కాంబినేషన్‌లో ఓ భారీ ప్రాజెక్ట్ తెరకెక్కుతోంది. ఇందులో బాలీవుడ్ నటి దీపికా పదుకొణె కథానాయికగా కనిపించనుంది. అలాగే బాలీవుడ్ అగ్రకథానాయకుడు అమితాబ్ బచ్చన్ ఓ కీలకపాత్ర పోషిస్తున్నారు.
కాగా, సంక్రాంతి పండగ తర్వాత తమ చిత్రానికి సంబంధించి ఓ ప్రత్యేకమైన అప్‌డేట్ ఇస్తానని దర్శకుడు నాగ్‌అశ్విన్ ఈ ఏడాది ఆరంభంలో చెప్పాడు. ఈ క్రమంలోనే పండగ పూర్తియి పదిరోజులు కావొస్తున్నా ఎలాంటి అప్‌డేట్ ఇవ్వకపోవడం వల్ల నెటిజన్లు ట్విట్టర్ వేదికగా వరుస ట్వీట్లు చేస్తున్నారు. దీంతో స్పందించిన అశ్విన్.. "జనవరి 29న కానీ ఫిబ్రవరి 26న కానీ కచ్చితంగా అప్‌డేట్ ఉంటుంది" అని సమాధానమిచ్చాడు.