ప్రభాస్ అందరూ అనుకున్నంత సిగ్గరి కాదని హీరోయిన్ పూజా హెగ్డే చెప్పింది. 'రాధేశ్యామ్' షూటింగ్లో అప్పుడప్పుడు తనను ర్యాగింగ్ చేసేవారని తెలిపింది. దీనితో పాటు సినిమా అనుభవాల్ని పంచుకుంది.
"సెట్లో ఉంటే ప్రభాస్ అంత సిగ్గరి ఏం కాదు. ఆయనతో ఉంటే సహనటీనటులకు సౌకర్యంగా ఉంటుంది. సెట్లో ప్రభాస్ ఉంటే సందడే సందడి. అయితే తెలియని వాళ్లతో మాట్లాడేటప్పుడు మాత్రమే ఆయన సిగ్గుపడతారు"
"రాధేశ్యామ్' అన్ని ప్రేమకథల్లాంటిది కాదు. కొత్తగా ఉంటుంది. చిత్రీకరణ మొదలైన తొలి రోజు నుంచే మేం స్నేహితులుగా మారడం వల్ల మా మధ్య ఆన్ స్క్రీన్ కెమిస్ట్రీ బాగా వచ్చింది. సినిమా మీకు కచ్చితంగా నచ్చుతుంది" అని పూజా హెగ్డే చెప్పింది. ఈమె నటించిన 'మోస్ట్ ఎలిజిబుల్ బ్యాచ్లర్', 'సర్కస్', 'ఆచార్య' సినిమాల్లో నటిస్తూ బిజీగా ఉంది.
ఇవీ చదవండి: