ప్రభాస్ తన కొత్త చిత్ర టైటిల్‌ను వదులుకున్నాడా? తన 20వ సినిమాకు మరో కొత్త టైటిల్‌ను ఖారారు చేసుకోబోతున్నాడా? అవుననే అంటున్నాయి చిత్రసీమ వర్గాలు. ప్రస్తుతం డార్లింగ్ తన 20వ చిత్రాన్ని 'జిల్' ఫేం రాధాకృష్ణ దర్శకత్వంలో చేస్తున్నాడు. 'జాన్' వర్కింగ్ టైటిల్‌తో సెట్స్‌పైకి వెళ్లిన ఈ చిత్రం ఇప్పటికే ఓ షెడ్యూల్ చిత్రీకరణను పూర్తి చేసుకుంది. ఈనెల 20 నుంచి హైదరాబాద్‌లో కొత్త షెడ్యూల్‌ను ప్రారంభించుకోబోతున్నట్లు సమాచారం. ఇప్పుడీ చిత్ర టైటిల్‌కు సంబంధించి ఓ ఆసక్తికర అంశం సినీ వర్గాల్లో చర్చనీయాంశంగా మారింది.
ప్రస్తుతం ఈ సినిమాను ఏ వర్కింగ్ టైటిల్‌తో అయితే సెట్స్‌పైకి తీసుకెళ్లారో.. దాన్నే తుది టైటిల్‌గా ఖరారు చేయాలని చిత్రబృందం నిన్నమొన్నటి వరకు ఆలోచన చేసిందట. కానీ, ఇప్పటికే ఇది ప్రేక్షకులకు రివీల్ అయిపోవడం వల్ల అదే పేరుతో బయటకొస్తే సినీప్రియుల్లో అంత హైప్ క్రియేట్ అవదేమో అనే ఉద్దేశంతో ఆ ప్రయత్నాన్ని విరమించుకుందట.
ఈ టైటిల్ విషయంలో జాప్యం కారణంగానే దిల్‌రాజు.. తన '96' రీమేక్ చిత్రీకరణ పూర్తయినా సినిమా పేరును బయటకు చెప్పడంలో ఆలస్యం చేశాడట. నిజానికి రాజు.. మొదటి నుంచీ తన చిత్రానికి 'జాను' అనే టైటిల్‌నే ఖరారు చేయాలనే ప్రయత్నించాడట. కానీ, ఓవైపు 'ప్రభాస్ 20'కి దీనికి దగ్గర పోలికలతో ఉన్న 'జాన్'ను పరిశీలిస్తుండటం వల్ల తన టైటిల్‌ను ప్రకటించడానికి కాస్త వెనకాడాడట. కానీ, ఇటీవలే రాధాకృష్ణ బృందం ఆ టైటిల్‌ను వదులుకున్నట్లు సంకేతాలివ్వడం వల్ల వెంటనే దిల్‌రాజు తన చిత్రానికి 'జాను'ను ఖరారు చేసినట్లుగా తెలుస్తోంది. మొత్తానికి ఈ వ్యవహారాన్నంతా చూస్తే 'ప్రభాస్ 20' ఓ కొత్త టైటిల్‌తో ప్రేక్షకుల ముందుకు రాబోతున్నట్లు అర్థమవుతోంది.
ఇవీ చూడండి.. 'అవి సినిమాల్లో మాత్రమే.. నిజంగా జరగవు'