యంగ్ రెబల్‌స్టార్ ప్రభాస్ 'బాహుబలి' చిత్రంతో ప్రపంచవ్యాప్తంగా గుర్తింపు దక్కించుకున్నాడు. ఆ తర్వాత ప్రతి చిత్రం పాన్ ఇండియా స్థాయిలోనే చేస్తున్నాడు. ఇప్పటికే ప్రభాస్ చేతిలో 'ఆదిపురుష్', 'సలార్', నాగ్ అశ్విన్‌తో ఓ భారీ బడ్జెట్ చిత్రాలు ఉన్నాయి. వీటి షూటింగ్‌లతో చాలా బిజీగా ఉన్నాడు డార్లింగ్. అయితే ఇప్పుడు ఇతడికి సంబంధించిన మరో వార్త నెట్టింట తెగ హల్చల్ చేస్తోంది. త్వరలోనే డార్లింగ్ హాలీవుడ్లో అడుగుపెట్టబోతున్నాడన్నది ఈ వార్త సారాంశం.
హాలీవుడ్ చిత్రం 'మిషన్ ఇంపాజిబుల్' ఫ్రాంచైజీకి ప్రపంచవ్యాప్తంగా గుర్తింపు ఉంది. ముఖ్యంగా టామ్ క్రూజ్ చేసే స్టంట్స్‌కు ప్రేక్షకులు ఈలలు కొట్టాల్సిందే. ఇప్పుడు ఈ సిరీస్‌లో 7వ చిత్రమైన 'మిషన్ ఇంపాజిబుల్ 7' తెరకెక్కుతోంది. ఇందులో ప్రభాస్ కీలకపాత్ర పోషిస్తున్నట్లు వార్తలు వస్తున్నాయి. ఇటలీలో 'రాధేశ్యామ్' చిత్రీకరణ సమయంలో దర్శకుడు క్రిస్టోఫర్ మెక్‌క్వారీ ప్రభాస్‌ను కలిసి కథ వివరించాడట. అది డార్లింగ్‌కు నచ్చడం వల్ల ఓకే చెప్పినట్లు వార్తలు వస్తున్నాయి. కొన్ని ఫైట్ సన్నివేశాల్ని కూడా పూర్తి చేశాడని నెట్టింట చెప్పుకొంటున్నారు. అయితే ఈ విషయంపై తాజాగా స్పందించాడు మెక్‌క్వారీ.
ప్రభాస్‌ను కలవలేదు
ఈ వార్త నెట్టింట వైరల్‌గా మారడం వల్ల దీనిపై స్పందించాడు మెక్‌క్వారీ. తాను ప్రభాస్‌ను ఎప్పుడూ కలవలేదని స్పష్టం చేశాడు. సోషల్ మీడియా ద్వారా ఇదంతా జరిగిందని వెల్లడించాడు.
-
While he‘s a very talented man, we’ve never met.
— Christopher McQuarrie (@chrismcquarrie) May 26, 2021 " class="align-text-top noRightClick twitterSection" data="
Welcome to the internet. https://t.co/mvVFP6N4zV
">While he‘s a very talented man, we’ve never met.
— Christopher McQuarrie (@chrismcquarrie) May 26, 2021
Welcome to the internet. https://t.co/mvVFP6N4zVWhile he‘s a very talented man, we’ve never met.
— Christopher McQuarrie (@chrismcquarrie) May 26, 2021
Welcome to the internet. https://t.co/mvVFP6N4zV