ETV Bharat / sitara

ప్రభాస్ డ్యుయెల్ రోల్.. ఓ పాత్రలో ఆర్మీ ఆఫీసర్​గా! - prabhas in double role

'సలార్'​ సినిమాలో ప్రభాస్​ ద్విపాత్రాభినయం చేయనున్నారని తెలిసింది. అందులోని ఓ పాత్రలో ఆర్మీ అధికారిగా కనిపించనున్నారని జోరుగా ప్రచారం సాగుతోంది.

prabhas
ప్రభాస్​
author img

By

Published : May 17, 2021, 9:08 AM IST

హీరో ప్రభాస్​-'కేజీఎఫ్'​ ఫేం ప్రశాంత్ నీల్​ కాంబోలో ప్రతిష్ఠాత్మకంగా తెరకెక్కుతున్న సినిమా 'సలార్'​. తాజాగా ఈ చిత్రం గురించి ఓ వార్త నెట్టింట్లో హల్​చల్​ చేస్తోంది. ఇందులో డార్లింగ్​.. ద్విపాత్రాభినయం చేయనున్నారని తెలిసింది. అందులో ఒకటి ఆర్మీ ఆఫీసర్​గా కనిపించనున్నారట. మరొక పాత్ర ఏమిటనేది స్పష్టత లేదు. ఆర్మీ నేపథ్యంలో తెరకెక్కించే సన్నివేశాలు సినిమాకే హైలెట్​గా ఉండనున్నాయట. మరి ఇందులో నిజమెంతో తెలియాలంటే అధికారిక ప్రకటన లేదా సినిమా విడుదలయ్యే వరకు వేచి చూడాల్సిందే.

పూర్తిస్థాయి యాక్షన్​ ఎంటర్​టైనర్​గా తెరకెక్కుతున్న ఈ చిత్రంలో శ్రుతిహాసన్​ కథానాయిక. ప్రస్తుతం కరోనా కారణంగా చిత్రీకరణకు తాత్కాలికంగా వాయిదా పడింది.

ఇదీ చూడండి: ప్రభాస్.. 'సలార్', 'ఆదిపురుష్' కోసం ఒకేసారి!

ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.