సూపర్ స్టార్ మహేశ్ బాబుకు హైదరాబాద్‌లో 'ఏఎంబీ మాల్' పేరుతో థియేటర్ ఉంది. ఇక్కడకు సినిమా చూసేందుకు అనేక మంది రాజకీయ, సినీ ప్రముఖులు వస్తుంటారు. తాజాగా 'సాహో' చిత్రాన్ని వీక్షించేందుకు యంగ్ రెబల్‌స్టార్ ప్రభాస్ వచ్చాడు.
ప్రభాస్‌కు ఏఎంబీ మాల్ సిబ్బంది ఘన స్వాగతం పలికారు. యంగ్‌రెబల్ స్టార్‌ను చూసేందుకు అభిమానులు ఎగబడ్డారు.
ప్రస్తుతం 'జిల్' ఫేం రాధాకృష్ణ దర్శకత్వంలో ఓ సినిమా చేస్తున్నాడు ప్రభాస్. పీరియాడికల్ లవ్‌స్టోరీగా తెరకెక్కుతోన్న ఈ చిత్రంలో పూజా హెగ్డే హీరోయిన్గా చేస్తోంది.
ఇవీ చూడండి.. టీజర్: 'చాణక్య'లో గూఢచారిగా గోపీచంద్