ETV Bharat / sitara

రాముడిగా ప్రభాస్!.. నాగ్ అశ్విన్ ట్వీట్​తో క్లారిటీ

యంగ్ రెబల్ స్టార్ ప్రభాస్​ పాన్ ఇండియా చిత్రాలతో జోరు చూపిస్తున్నాడు. ఇటీవలే నాగ్ అశ్విన్​తో భారీ బడ్జెట్ చిత్రాన్ని ప్రకటించిన డార్లింగ్.. ఈసారి బాలీవుడ్​లో నేరుగా ఎంట్రీ ఇచ్చేందుకు సిద్ధమయ్యాడు. 'తానాజీ' ఫేం ఓం రౌత్ దర్శకత్వంలో సినిమా చేస్తున్నట్లు ప్రకటించాడు. ఇందులో ప్రభాస్​ రాముడిగా కనిపించనున్నాడని వార్తలు వచ్చాయి. దీనిపై ఓ క్లారిటీ వచ్చింది.

రాముడిగా ప్రభాస్
రాముడిగా ప్రభాస్
author img

By

Published : Aug 18, 2020, 8:57 PM IST

యంగ్ రెబల్​స్టార్ ప్రభాస్‌ కథానాయకుడిగా బాలీవుడ్‌లో తెరకెక్కుతున్న 3డీ ఫిల్మ్‌ 'ఆది పురుష్‌'. ఓం రౌత్‌ దర్శకుడు. మంగళవారం ఉదయం టైటిల్‌తో పాటు, కాన్సెప్ట్‌ పోస్టర్‌ను విడుదల చేయడం వల్ల ఈ సినిమాపై అనేక రకాల ఊహాగానాలు మొదలయ్యాయి. పోస్టర్‌లో రామాయణ పాత్రలు కనిపించాయి. దీంతో బాలీవుడ్‌లోనూ, ఇటు టాలీవుడ్‌లోనూ దీనిపైనే చర్చ మొదలైంది. ఇందులో ప్రభాస్‌ రాముడిగా కనిపిస్తాడా? లేదా? ఆ పాత్ర లక్షణాలతో ప్రభాస్‌ పాత్ర సరికొత్తగా ఉంటుందా? ఇలా అనేక ప్రశ్నలు సామాజిక మాధ్యమాల వేదికగా చక్కర్లు కొట్టాయి. తాజాగా దర్శకుడు నాగ్‌ అశ్విన్‌ చేసిన ట్వీట్‌తో ప్రభాస్‌ పాత్రపై ఓ క్లారిటీ వచ్చింది.

"ప్రభాస్‌గారిని రాముడిగా చూసేందుకు ఎంతో ఉత్సుకతతో ఎదురు చూస్తున్నా. ఆ పాత్రను వెండితెరపై చాలా కొద్దిమంది నటులు మాత్రమే పోషించారు. చిత్ర బృందానికి శుభాకాంక్షలు" అని నాగ్‌ అశ్విన్ ట్వీట్‌ చేయడ వల్ల 'ఆది పురుష్‌'లో ప్రభాస్‌ రాముడిగా కనిపిస్తాడని అర్థమవుతోంది. అయితే, దీనిపై చిత్ర బృందం మాత్రం ఎక్కడా స్పందించ లేదు.

  • Very excited to see prabhas garu as Lord Rama...only very few actors have played him on the big screen before...good luck to the whole team! #Adipurush https://t.co/evGHogaIHC

    — Nag Ashwin (@nagashwin7) August 18, 2020 " class="align-text-top noRightClick twitterSection" data=" ">

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.