ETV Bharat / sitara

ప్రభాస్ కొత్త​ సినిమా.. 'బజార్​ రౌడీ'గా సంపూ - నాగశౌర్య 20వ సినిమా టైటిల్​ లక్ష్య

కొత్త సినిమా కబుర్లు మీ ముందుకు వచ్చేశాయి. కేజీఎఫ్​ దర్శకుడు ప్రశాంత్​ నీల్ దర్శకత్వంలో ప్రభాస్​ కొత్త సినిమా రాబోతున్నట్లు తెలిసింది. నాగశౌర్య 20వ సినిమాకు 'లక్ష్య'గా టైటిల్​ను ప్రకటించారు. పుట్టినరోజు సందర్భంగా రాశీఖన్నా మొక్కలు నాటింది. ఇంకా పలు సినిమా విశేషాలు కూడా ఉన్నాయి. అవేంటో చూద్దాం.

prabaha
ప్రభాస్ కొత్త​ సినిమా.
author img

By

Published : Nov 30, 2020, 6:50 PM IST

Updated : Nov 30, 2020, 9:18 PM IST

*సూపర్​ హిట్​ చిత్రం 'కేజీఎఫ్'​ను నిర్మించిన దక్షిణాది ప్రముఖ నిర్మాణ సంస్థ హోంబలే ఫిల్మ్స్ .. తాజాగా మరో పాన్​ ఇండియా ప్రాజెక్ట్​ చేయనున్నట్లు అధికారికంగా ప్రకటించింది. డిసెంబర్​ 2న మధ్యాహ్నం 2.09గంటలకు ఈ చిత్ర వివరాలు వెల్లడించినున్నట్లు ట్వీట్​ చేసింది. అయితే ఈ సినిమా 'కేజీఎఫ్'​ దర్శకుడు ప్రశాంత్​ నీల్​-హీరో ప్రభాస్​ కాంబోలో ఉంటుందని సామాజిక మాధ్యమాల్లో జోరుగా ప్రచారం సాగుతోంది.

*టాలీవుడ్​ యువ హీరో నాగశౌర్య 20వ సినిమా టైటిల్​ను 'లక్ష్య'గా​ ప్రకటించింది చిత్రబృందం. ఈ చిత్రానికి సంతోష్‌ జాగర్లపూడి దర్శకత్వం వహిస్తున్నారు. ఈ సినిమాలో శౌర్య.. ఆర్చరీ క్రీడాకారుడుగా ఎనినిది పలకల దేహంతో కనిపించనున్నారు.

*సోమవారం తన పుట్టినరోజు సందర్భంగా గ్రీన్​ఇండియా ఛాలెంజ్​లో పాల్గొన్న హీరోయిన్​ రాశీ ఖన్నా.. మొక్కలు నాటారు. దీనికి సంబంధించిన ఫొటోలను ట్విట్టర్​లో అభిమానులతో పంచుకున్నారు.

*వసంత నాగేశ్వరావు దర్శకత్వంలో సంపూర్ణేష్ బాబు హీరోగా 'బజార్ రౌడీ' సినిమా రాబోతుంది. ఈ చిత్రంలో సంపూ తన డ్యాన్స్‌తో ప్రేక్షకులను మైమరిపించబోతున్నారు. తాజాగా రామోజీ ఫిలిం సిటీలో ఈ సినిమాకు సంబంధించి ఓ పాటను చిత్రీకరిస్తున్నారు. ఈ పాటకు ప్రేమ్ రక్షిత్ కొరియోగ్రఫీ అందిస్తున్నారు. దీనికి సంబంధించిన ఓ ఫొటోను ట్వీట్​ చేసింది చిత్రబృందం.

*ప్రముఖ దర్శకుడు రామ్​గోపాల్​ వర్మ తెరకెక్కించిన సినిమా 'కరోనా వైరస్'​. ఈ చిత్రాన్ని డిసెంబర్​ 11న థియేటర్లలో విడుదల చేయనున్నట్లు తెలిపింది చిత్రబృందం. లాక్​డౌన్​ తర్వాత రిలీజ్​ కానున్న తొలి తెలుగు సినిమా కావడం విశేషం.

prasanth neel
ప్రశాంత్​ నీల్​-ప్రభాస్​ కాంబోల సనిమా వచ్చే అవకాశం
nagashourya
నాగశౌర్య 20వ సినిమా టైటిల్​ 'లక్ష్య'
rasikhanna
మొక్కలు నాటిన రాశీ
sampu
బజార్​ రౌడీగా సంపూ
corona virus
రామ్​ గోపాల్​ వర్మ తెరకెక్కించిన 'కరోనా వైరస్'​ సినిమా

Last Updated : Nov 30, 2020, 9:18 PM IST
ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.